శుక్రవారం 23 అక్టోబర్ 2020
Cinema - Sep 25, 2020 , 15:33:16

బాలు చివ‌రి కోరిక ఇదే..!

బాలు చివ‌రి కోరిక ఇదే..!

సంగీత ప్ర‌పంచంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం గొంతు మూగబోయింది. భార‌తీయ సంగీతం మ‌ధుర‌మైన గొంతును మిస్ అయింది. ఇంజినీరింగ్ మధ్యలో మానేసిన ఆయన సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు.  కెరీర్లో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన బాలు భారతీయ సంగీత ప్రపంచంలోనే ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.ఎంతో మంది యువ గాయ‌కుల‌ని ప్రోత్స‌హించిన బాలు ఓ ఇంట‌ర్వ్యూలో త‌న చివ‌రి  కోరిక ఒక‌టి ఉంద‌ని పేర్కొన్నారు.  

కెరీర్లో ఎన్నో ప్రశంసలు, అవార్డులు, రివార్డులు పొందిన తాను మరణించే వరకు పాడుతూనే ఉండాలని చెప్పారు. చావు నా దగ్గరికి వచ్చినట్లు తెలియకుండానే నేను కన్నుమూయాలి. అదే నా చివరి కోరిక’ అంటూ బాలు తన మనసులో మాట చెప్పారు. అంతేకాదు త‌న‌కున్న పేరు ప్రతిష్ఠల వల్ల నా కొడుకు కెరీర్ సక్రమంగా కొనసాగలేదని చెప్పుకొచ్చారు. చరణ్‌ను అందరూ త‌న‌తో పోల్చి చూడటం వల్ల వాడికి చాలా నష్టం జరిగింద‌ని చాలా బాధ‌ప‌డ్డారు. సంగీతం అని, నటన అని, సినిమా నిర్మాణం అని తడబడ్డాడు. చ‌ర‌ణ్ ..ఐదు సినిమాలు నిర్మించి రూ.11కోట్లు నష్టపోయాడు అని బాలు 
logo