ఆదివారం 17 జనవరి 2021
Cinema - Nov 12, 2020 , 15:08:29

నా ఫేవ‌రెట్ వీడియోల్లో ఇది ఒక‌టి

నా ఫేవ‌రెట్ వీడియోల్లో ఇది ఒక‌టి

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానుల‌ను విడిచిపెట్టి వెళ్లినా..సినిమాల‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోతాడు. త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల కంట క‌న్నీరు తెప్పించే సుశాంత్ ఆక‌స్మిక మృతి యావ‌త్‌దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌ల‌ను దిగ్బ్రాంతికి గురి చేసింది. ఎప్పుడూ ఫ‌న్ గా క‌నిపించే సుశాంత్ త‌న‌కు టైం దొరికిన‌ప్పుడల్లా పాట్నాకు వెళ్లి స్థానికుల‌తో స‌ర‌దాగా గ‌డిపేవాడు. క్రికెట్ ఆడేవాడు. అంద‌రితో ఫ్రెండ్లీగా ఉంటూ స‌ర‌దాగా ఆట‌లాడిన వీడియోలు ఇప్ప‌టికే నెట్టింట్లో వైర‌ల్ అయ్యాయి.

తాజాగా సుశాంత్ మేన‌కోడ‌లు మ‌ల్లికాసింగ్‌ ఓ వీడియో ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. నా ఫేవ‌రెట్ వీడియోల్లో ఇది ఒక‌టి అంటూ..సుశాంత్ పెట్ తో ఆడుతున్న వీడియోను మల్లిక‌ షేర్ చేసింది. సుశాంత్ ఫ‌న్ టైం పాత వీడియోతో త‌న మ‌ధుర క్ష‌ణాల‌ను అంద‌రితో పంచుకుంది‌. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.