బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 02, 2020 , 15:46:28

ప్రార్ధ‌న‌ల కోసం గుమిగూడే స‌మ‌యం ఇది కాదు: రెహ‌మాన్‌

ప్రార్ధ‌న‌ల కోసం గుమిగూడే స‌మ‌యం ఇది కాదు: రెహ‌మాన్‌

మర్కజ్‌ మసీదు ఘటన దేశ వ్యాప్తంగా ఎంత అల‌జ‌డి సృష్టిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌త ప్రార్ధ‌న‌ల కోసం గ‌త నెల‌ ఢిల్లీ వెళ్లిన వారు ఇటీవ‌ల సొంత రాష్ట్రాల‌కి చేరుకున్నారు. వీరిలో చాలా మందికి క‌రోనా వైర‌స్ సోక‌డంతో వారి ఆచూకీ క‌నుగొనే ప‌నిలో ప‌డ్డారు పోలీసులు. అయితే ఢిల్లీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏఆర్ రెహ‌మాన్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. 

క‌రోనాని అరిక‌ట్టేందుకు రేయింబ‌వ‌ళ్ళు క‌ష్ట‌ప‌డుతూ త‌మ ప్రాణాల‌ని ప‌ణంగా పెడుతున్న వైద్యులు, నర్సులు, ఇత‌ర సిబ్బందికి ధ‌న్యావాదాలు తెలిపారు రెహ‌మాన్. క‌రోనాని క‌ట్టడిలో భాగంగా త‌మ ప్రాణాలు రిస్క్‌లో పెట్టి  మ‌న కోసం ఎంత‌గానో కృషి చేస్తున్న వారి తీరును అభినందించాలన్నారు. ప్రాణాంతక వైరస్‌తో పోరాడాల్సిన ప్రస్తుత తరుణంలో భేషజాలకు వెళ్లకుండా అంతా కలిసికట్టుగా ఉండాలని సూచించారు. కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నామని.. ఇటువంటి సమయంలో మానవత్వాన్ని పరిమళింపజేయాలని సూచించారు. 

మ‌త‌ప‌ర‌మైన ప‌విత్ర స్థలాల‌లో గుమిగూడే స‌మ‌యం ఇది కాదు. దేవుడు మ‌న హృద‌యంలోనే ఉన్నాడు. ప్ర‌భుత్వం చెప్పిన సూచ‌న‌లు త‌ప్ప‌క పాటించండి. స్వీయ నియంత్ర‌ణ పాటిస్తే ఎక్కువ రోజులు బ‌త‌క‌వ‌చ్చు. వైర‌స్‌ని వ్యాప్తి చేస్తూ, సాటి మ‌నుషుల‌కి హాని క‌లిగించ‌కండి. మీరు వైర‌స్ సోక‌దు అనుకుంటే అది మూర్ఖ‌త్వ‌మే. వ‌దంతులు వ్యాప్తి చేసి ప్ర‌జ‌ల‌లో భ‌యాందోళ‌న‌లు క‌లిగించ‌కండి. ల‌క్ష‌ణాది మంది ప్రాణాలు మ‌న చేతిలో ఉన్నాయి. కొంచెం జాగ్ర‌త్త‌గా ఉండ‌డం అంటూ రెహమాన్ త‌న పోస్ట్‌లో పేర్కొన్నారు .

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు, క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo