బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 02, 2020 , 23:18:41

అంతరాలను చెరిపేద్దాం

అంతరాలను చెరిపేద్దాం

కరోనాపై పోరాటంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు ప్రముఖ  సంగీత దర్శకుడు ఏ.ఆర్‌.రెహమాన్‌. ప్రాణాలను రిస్క్‌ చేస్తూ నిస్వార్థంగా దేశ సేవలో నిమగ్నమైన ధీరోదాత్తులు వారంటూ ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశప్రజలందరు అన్ని అంతరాలను చెరిపివేసుకొని కనిపించని శత్రువుపై పోరాటం చేయాలని రెహమాన్‌ పిలుపునిచ్చారు. మానవత, ఆధ్యాత్మిక భావ పరిమళాలతో ప్రజలందరూ ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి కార్యోన్ముఖులు కావాలన్నారు.  దేవుడు మన హృదయాల్లోనే ఉన్నాడని, ఈ సమయంలో మతపరమైన సమావేశాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజలందరూ ప్రభుత్వ సూచనలను పాటించాలని, కొన్ని వారాల స్వీయ నిర్బంధం కొన్నేళ్ల్ల జీవితాన్ని ప్రసాదిస్తుందని రెహమాన్‌ చెప్పారు. 


logo