ఆదివారం 29 నవంబర్ 2020
Cinema - Oct 27, 2020 , 20:21:56

చిరంజీవి సోద‌రి పాత్ర చేసేదెవ‌రో తెలుసా..?

చిరంజీవి సోద‌రి పాత్ర చేసేదెవ‌రో తెలుసా..?

టాలీవుడ్ యాక్ట‌ర్ చిరంజీవి త‌మిళంలో సూప‌ర్ హిట్ గా నిలిచిన వేదాలమ్ తెలుగు రీమేక్ లో న‌టిస్తున్న సంగతి తెలిసిందే. మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ చిత్రం 2021లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ చిత్రంలో హీరో సోద‌రి పాత్ర‌కు చాలా ప్రాముఖ్య‌త ఉంటుంది. ఈ రోల్ లో సాయిప‌ల్ల‌వి కానీ కీర్తిసురేశ్ ను కానీ తీసుకోనున్న‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. అయితే దీనిపై ఓ క్లారిటీ వ‌చ్చింది.

తాజా స‌మాచారం ప్ర‌కారం చిరంజీవి సోద‌రి పాత్ర‌కు కీర్తిసురేశ్ ను ఫైన‌ల్ చేసింద‌ట మెహ‌ర్ ర‌మేశ్ అండ్ టీం. మ‌హాన‌టిగా తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన కీర్తిసురేశ్‌, మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి సిల్వ‌ర్ స్క్రీన్ పై కనిపించ‌నుంద‌ని వార్త‌లు రావ‌డంతో అభిమానులు సంతోషంలో ఎగిరిగంతేస్తున్నారు. చిరంజీవి-కొర‌టాల శివ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న ఆచార్య షూటింగ్ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో నిలిచిపోయింది. షూటింగ్ ఎప్పుడు రీస్టార్ట్ అవుతుందో తెలియాల్సి ఉంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.