శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 22, 2020 , 21:17:20

20 సార్లు కరోనా టెస్ట్..ఆ హీరోయిన్ ఎవ‌రంటే..?

20 సార్లు కరోనా టెస్ట్..ఆ హీరోయిన్ ఎవ‌రంటే..?

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 సార్లు కరోనా టెస్ట్ చేయించుకుంది బాలీవుడ్ నటి ప్రీతిజింటా. అయితే ఇందుకు కారణం వుందని చెబుతుంది ఈ అందాలభామ. ప్రస్తుతం నేను బయో బబుల్ సెగ్మెంట్‌లో వున్నాను. బయో బబుల్ అంటే ఆరు రోజుల క్వారంటైన్ నుంచి ఇది ప్రారంభమవుతుంది.ప్రతి మూడు నాలుగు రోజులకు కరోనా పరీక్షలుంటాయి. బయటికి వెళ్లడానికి వీలుండదు. నాతో పాటు నా సహచర, వ్యక్తిగత ఉద్యోగులు కూడా బయోబబుల్‌లో వుండాల్సిందే. బయటి ఆహారం తీసుకోకూడదు.. బయటి వ్యక్తులను కలవకూడదు కూడా అని చెప్పింది.

అయితే ఇదంతా ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణలో భాగంగానే 20 సార్లు ప్రీతికి కరోనా టెస్టులు జరుగుతున్నాయి. ఆమె కింగ్ ఎలెవన్ పంజాబ్ జట్టు కో ఓనర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.