బుధవారం 25 నవంబర్ 2020
Cinema - Oct 22, 2020 , 17:19:31

ట్రాన్స్ జెండ‌ర్ పాత్ర‌లో హీరోయిన్

ట్రాన్స్ జెండ‌ర్ పాత్ర‌లో హీరోయిన్

2013లో శుధ్ దేశీ రొమాన్స్ చిత్రంతో సిల్వ‌ర్ స్క్రీన్ పై మెరిసింది అందాల బ్యూటీ వాణీక‌పూర్ . ఆ త‌ర్వాత‌ నానితో క‌‌లిసి త‌మిళ చిత్రం ఆహాక‌ళ్యాణంలో న‌టించింది. ఈ భామ ప్ర‌స్తుతం అక్ష‌య్ కుమార్ తో బెల్ బాట‌మ్ చిత్రంలోనూ న‌టిస్తోంది. ఆయుష్మాన్ ఖురానా న‌టిస్తోన్న కొత్త చిత్రం చండీగ‌ఢ్ క‌రే ఆశిఖీ. ఈ ప్రాజెక్టులో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ఛాలెంజింగ్ రోల్ లో క‌నిపించ‌నుంది వాణీ. ఈ చిత్రంలో వాణీక‌పూర్ ట్రాన్స్ జెండ‌ర్ పాత్ర‌లో సంద‌డి చేయ‌నుంది.

ట్రాన్స్ జెండ‌ర్ తో ప్రేమ‌లో ప‌డ్డ వ్య‌క్తిగా ఆయుష్మాన్ క‌నిపిస్తాడు. కొత్తద‌నంతో కూడిన క‌థాంశాల‌ను ఎంచుకుంటుంది వాణీక‌పూర్‌. వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న ఈ ఢిల్లీ భామ ర‌ణ్ బీర్ క‌పూర్, సంజ‌య్ ద‌త్ న‌టిస్తోన్న షంషేరా మూవీలో యాక్ట్ చేస్తోంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.