టాలీవుడ్ యాక్టర్ అల్లు అర్జున్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం పుష్ప. సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రం ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ ప్రాజెక్టులో ఐటెం సాంగ్ ఉందని ఇప్పటికే అప్డేట్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇంతకీ ఐటెం సాంగ్ లో ఏ భామ మెరువబోతుందోనని సినీ లవర్స్ ఎక్జయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన న్యూస్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.
బాలీవుడ్ భామ దిశా పటానీ ఈ మాసీ డ్యాన్స్ నంబర్ కు స్టెప్పులేయబోతుందని టాక్. ఆడియెన్స్ లో క్యురియాసిటీని పెంచేస్తున్న ఈ పాటలో అల్లు అర్జున్తో కలిసి డ్యాన్స్ చేయబోతుంది దిశాపటాని. అయితే దీనిపై పుష్ప టీం నుంచి ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ న్యూస్ కన్ఫామ్ అయితే సిల్వర్ స్క్రీన్ పై బన్నీ-దిశాపటాని ఐటెం సాంగ్ తో ఎలా ఎంటర్ టైన్ చేస్తారో చూడాలి.
ఓటీటీ ఆఫర్లతో స్టార్ హీరో అప్సెట్..!
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
సలార్ లో స్టార్ హీరో భార్య పవర్ ఫుల్ రోల్..?
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
మరో స్పోర్ట్పై కన్నేసిన నాని..!
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు