ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 22, 2020 , 08:48:56

గ‌రం గ‌రంగా నామినేష‌న్ ప్ర‌క్రియ‌..!

గ‌రం గ‌రంగా నామినేష‌న్ ప్ర‌క్రియ‌..!

బిగ్ బాస్ హౌజ్‌లో ఇప్పుడిప్పుడే కాక రేగుతుంది. ఇన్నాళ్ళు క‌లిసి మెలిసి ఉన్న కంటెస్టెంట్‌ల మ‌ధ్య బిగ్ బాస్ చిచ్చు పెడుతున్నాడు. దీంతో హౌజ్ వాతావ‌ర‌ణం హీటెక్కుతుంది. సోమ‌వారం రోజు ఎలిమినేష‌న్ కోసం నామినేష‌న్ ప్ర‌క్రియ నిర్వ‌హించ‌గా కంటెస్టెంట్స్ త‌మ‌కు న‌చ్చని వారి ఫోటోల‌ని మంట‌ల‌లో కాల్చి నామినేట్ చేశారు. ఈ క్ర‌మంలో మూడో వారానికి గాను కుమార్ సాయి, ఆరియానా, మోనాల్, హారిక, దేవీ, లాస్య, మెహబూబ్‌లు ఎలిమినేష‌న్ కోసం నామినేట్ అయ్యారు.

బిగ్ బాస్ సీజ‌న్ 4 నుండి ఇప్ప‌టికే సూర్య కిర‌ణ్, క‌ళ్యాణి ఎలిమినేట్ కాగా, మూడో వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నే ఆస‌క్తి అందరిలో ఉంది.  క‌ళ్యాణి వెళుతూ వెళుతూ బిగ్ బాంబ్ దేవిపై వేయ‌డంతో ఆమె డైరెక్ట్‌గా నామినేష‌న్‌లోకి వెళ్ళింది.ఇక సోమ‌వారం జ‌రిగిన ఎపిసోడ్‌లో ఆదివారం జరిగిన ఎలిమినేష‌న్ ప్రక్రియ గురించి కొంత‌సేపు డిస్క‌ష‌న్ జ‌రిపారు. మెహ‌బూబ్ త‌న‌ను సిల్లీ రీజ‌న్‌తో నామినేట్ చేసాడ‌ని హారిక తెగ ఫీలైంది. అత‌ను నా ఇగోను హ‌ర్ట్ చేశాడంటూ పేర్కొంది

ఇప్ప‌టి వ‌ర‌కు చాలా క్లోజ్‌గా ఉన్న అరియానా, సోహైల్‌ల మ‌ధ్య వార్ న‌డిచింది.ఆనియ‌న్స్ క‌ట్ చేశాక టేబుల్ క్లీన్ చేయ్ అని అరియానా..సోహైల్‌కు చెప్ప‌డంతో అత‌ను సీరియ‌స్ అయ్యాడు. నువ్వు నాకు చెప్ప‌కు, ఆర్డ‌ర్స్ వేయ‌కంటూ మండిప‌డ్డాడు. ఇక గ‌త వారం రేష‌న్ డీలర్‌గా ఉన్న అమ్మ రాజ‌శేఖ‌ర్ త‌న బాధ్య‌త‌ల‌ను అభిజిత్‌కు ఇచ్చారు. మిగ‌తా హౌజ్‌మేట్స్ అంద‌రు ఏకాభిప్రాయంతో అతనిని ఎన్నుకోవ‌డంతో అభిజిత్ ఈ వారం రేష‌న్ డీల‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నాడు.

ఇక మూడోవారం నామినేష‌న్ కోసం జ‌రిగిన నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో నోయ‌ల్ హౌజ్ కెప్టెన్ అయిన కార‌ణంగా అత‌నిని నామినేష‌న్ నుండి త‌ప్పిస్తూ, ఒక‌రిని డైరెక్ట్‌గా నామినేట్ చేసే అధికారం ఇచ్చారు బిగ్ బాస్. దీంతో అత‌ను లాస్య‌ను నామినేట్ చేశాడు. మిగిలిన ఇంటి స‌భ్యులు ఇద్ద‌రిని నామినేట్ చేశారు. వారిలో .. మెహబూబ్ - అరియానా గ్లోరీ, హారికల‌ని నామినేట్ చేయ‌గా, దేవి - రాజశేఖర్ మాస్టర్, కుమార్ సాయి.. దేత్తడి హారిక - మొహబూబ్, సుజాత.. అవినాష్ - మొహబూబ్, హారిక.. దివి - మొనాల్ గజ్జర్, కుమార్ సాయి.. అభిజిత్ - అరియానా గ్లోరి, సుజాత.. కుమార్ సాయి - మెహబూబ్, అఖిల్ సార్థక్ .. గంగవ్వ - కుమార్ సాయి, మొనాల్ గజ్జర్ .. రాజ శేఖర్ - అరియానా గ్లోరి, కుమార్ సాయి .. మొనాల్ గజ్జర్ - అరియానా గ్లోరి, దివి .. అఖిల్ సార్థక్ - కుమార్ సాయి, అరియానా గ్లోరి ..సొహైల్ - అరియానా గ్లోరి, కుమార్ సాయి.. లాస్య - కుమార్ సాయి, అరియానా గ్లోరి .. అరియానా గ్లోరీ - మొనాల్ గజ్జర్, మెహబూబ్ .. జోర్దార్ సుజాత - దేత్తడి హారిక, అభిజిత్ ల‌ను నామినేట్ చేశారు.

ఈ నామినేష‌న్ ప్ర‌క్రియ‌లోను కొంత ర‌చ్చ జ‌రిగింది. ఒక‌రిపై ఒక‌రు ప‌లు ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. అయితే ఎక్కువ మంది నామినేట్ చేసిన వారిలో  లాస్య, అరియానా గ్లోరి, కుమార్ సాయి, మెహబూబ్, మోనాల్ గజ్జర్, హారికలు ఉండ‌గా వీరు మూడో వారానికి నామినేట్ అయ్యారు. వీరితో పాటు డైరెక్ట్‌గా నామినేష‌న్‌లోకి వ‌చ్చిన దేవి కూడా నామినేష‌న్‌లో  ఉన్న సంగ‌తి తెలిసిందే. 


logo