సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘తిమ్మరుసు’. ‘అసైన్మెంట్ వాలి’ ఉపశీర్షిక. శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు. మహేష్ కోనేరు, సృజన్ ఎరబోలు నిర్మిస్తున్నారు. ప్రియాంక జవాల్కర్ కథానాయిక. ఈ చిత్రాన్ని ఈ నెల 30న విడుదల చేయబోతున్నారు. గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత మహేష్ కోనేరు మాట్లాడుతూ ‘క్లిష్ట పరిస్థితుల్లో ఈ సినిమా షూటింగ్ చేశాం. ప్రతి ఒక్కరు చక్కటి సహకారం అందించారు. ఇందులో సత్యదేవ్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్ర చిత్రణ, ైస్టెల్ చాలా కొత్తగా ఉంటుంది. థియేటర్స్‌లోనే ఈ సినిమాను విడుదల చేస్తున్నాం’ అన్నారు. ‘శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో తిమ్మరుసు వ్యూహాలు పన్నడంలో దిట్ట. అలాంటి తెలివైన లాయర్ పాత్రలో సత్యదేవ్ కనిపిస్తారు. తప్పకుండా థియేటర్లలో చూడాల్సిన సినిమా ఇది’ అని దర్శకుడు తెలిపారు. తన కెరీర్లో విభిన్న కథా చిత్రమిదని సత్యదేవ్ పేర్కొన్నారు. బ్రహ్మాజీ, అజయ్, ప్రవీణ్, ఝాన్సీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అప్పూ ప్రభాకర్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, నిర్మాణ సంస్థలు: ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి.