శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Sep 20, 2020 , 17:07:10

వారికి ప్ర‌తీరోజు ఓ కొత్తమ్మాయి కావాలి: క‌ంగ‌నా

వారికి ప్ర‌తీరోజు ఓ కొత్తమ్మాయి కావాలి: క‌ంగ‌నా

బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత అనురాగ్ కశ్య‌ప్ త‌న‌పై లైంగిక దాడి చేశాడని న‌టి పాయ‌ల్ ఘోష్ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్‌లో లైంగిక వేధింపుల బారిన ప‌డిన వారిలో తాను కూడా ఉన్నాన‌ని కంగ‌నా కూడా చెప్పింది. బాలీవుడ్ లో చాలా పెద్ద హీరోలు త‌మ ప‌ట్ల లాకింగ్ వ్యాన్ లో కానీ రూంలో కానీ, పార్టీల్లో పాల్గొన్న‌పుడు కానీ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించేవార‌ని, ప‌ని కోసం అపాయింట్ మెంట్ తీసుకుని ఇంటికి రావాల‌ని చెప్పి, బ‌ల‌వంతం చేసేవార‌ని ట్విట‌ర్ లో ట్వీట్ చేసింది. 

బాలీవుడ్ సెక్సువ‌ల్ ప్రీడేట‌ర్స్ (లైంగిక మాంసాహారులు)ల‌తో నిండిపోయింది. వారివి ( బాలీవుడ్ హీరోలు, ప్ర‌ముఖులు) న‌కిలీ, డ‌మ్మీ పెళ్లిళ్లు. వారు సంతోషంగా ఉండేందుకు ప్ర‌తీ రోజు హాట్ గా ఉండే కొత్త యువ‌తిని ఆశిస్తుంటారు. యువ‌కు ల విష‌యంలో కూడా వారు ఇలానే చేస్తుంటారు. నా మార్గంలో నేను సెటిల్ అయ్యాను. కానీ చాలా మంది యువ‌తులు వారికి బ‌ల‌య్యారని కంగ‌నా ట్వీట్ లోపేర్కొంది. పాయ‌ల్ ఘోష్, కంగ‌నా వ్యాఖ్య‌లు రానున్న రోజుల్లో ఏ స్థాయికి వెళ్తాయో చూడాలి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.