బుధవారం 03 మార్చి 2021
Cinema - Jan 19, 2021 , 21:28:41

వ‌రుణ్‌ధావ‌న్ పెండ్లికి రానున్న స్టార్ హీరోలు..!

వ‌రుణ్‌ధావ‌న్ పెండ్లికి రానున్న స్టార్ హీరోలు..!

బాలీవుడ్ న‌టుడు వ‌రుణ్ ధ‌వన్‌-న‌టాషా ద‌లాల్ జ‌న‌వ‌రి 24న వివాహ బంధంతో ఒక్క‌ట‌వుతున్న సంగ‌తి తెలిసిందే. గ‌తేడాది మే నెలలో జ‌ర‌గాల్సిన వీరిద్ద‌రి వివాహం క‌రోనా ఎఫెక్ట్ తో నిలిచిపోయింది. వెడ్డింగ్ వేడుక‌లు ఐదు రోజుల‌పాటు గ్రాండ్ గా జ‌రుగుతాయ‌ని ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం కేవ‌లం ఒక రోజు మాత్ర‌మే వెడ్డింగ్ ఈవెంట్ జ‌రుగనుంద‌ట‌. జ‌న‌వ‌రి 22న అలీబాగ్ లో వెడ్డింగ్ ప‌నులు మొద‌లుపెట్టేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్న‌ట్టు బీటౌన్ వ‌ర్గాల టాక్‌. ఇదిలా ఉంటే క్రేజీ న్యూస్ ఒక‌టి బీటౌన్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

ద‌గ్గ‌రి బంధువులు, స్నేహితుల స‌మక్షంలో పెండ్లి వేడుక జ‌రుగనుంద‌ని తెలుస్తోండ‌గా..ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్ హీరోలు షారుక్‌ఖాన్‌, స‌ల్మాన్‌ఖాన్ హాజ‌రుకానున్నార‌ట‌. క‌ర‌ణ్‌జోహార్‌, శిల్పాశెట్టి-రాజ్‌కుంద్రా దంప‌తులు, డైరెక్ట‌ర్ రెమో డిసౌజా, శ‌శాంక్ కైతాన్ హాజ‌ర‌వ‌నున్నార‌ని తెలుస్తోంది.

ఇవి కూడా చ‌ద‌వండి..

శింబును వెలేసిన నిర్మాతల మండలి..?

టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ విల‌న్ ఇత‌డే..!

చిరంజీవి న‌న్ను చాలా మెచ్చుకున్నారు..

'వ‌కీల్‌సాబ్' కామిక్ బుక్ క‌వ‌ర్ లుక్ అదిరింది


బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతున్న‌ కేథ‌రిన్

గోవాలో స‌న్నీలియోన్ హాట్ ఫొటోషూట్

జాక్వెలిన్ పోజుల‌కు ఇంటర్ నెట్ షేక్..ఫొటోలు వైర‌ల్‌


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo