డైరెక్ట‌ర్ల‌ను మార్చుకున్న స్టార్ హీరోలు !

Dec 03, 2020 , 16:02:02

సినీ ప‌రిశ్ర‌మ‌లో సాధార‌ణంగా డైరెక్ట‌ర్ ఏదో ఒక హీరోను దృష్టిలో పెట్టుకుని క‌థ రాసుకుంటాడు. అయితే ఆ స్టోరీని తాను అనుకున్న యాక్ట‌ర్ తో తీసేందుకు వ‌ర్క‌వుట్ కాకపోతే మ‌రో హీరోను వెతుక్కుంటాడు. కొన్ని సార్లు రాసుకున్న క‌థ‌ను బ‌ట్టి హీరోను సెలెక్ట్ చేసుకుంటారు. ఇక అప్పు‌డపుడు ఓ డైరెక్ట‌ర్ తో సినిమా చేసే హీరో మ‌రో ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తుంటాడు. అలాంటి కేట‌గిరీలో వ‌స్తారు టాలీవుడ్ స్టార్ హీరోలు రాంచ‌ర‌ణ్‌, మ‌హేశ్ బాబు. మ‌హేశ్ బాబు 25వ సినిమా మ‌హ‌ర్షి తీసిన త‌ర్వాత వంశీపైడిప‌ల్లితో మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే కొన్ని అనివార్య కారణాల‌తో మ‌హేశ్-వంశీపైడిప‌ల్లి కాంబోకు బ్రేక్ ప‌డ్డది. దీంతో వంశీ తాను రాసుకున్న క‌థ‌ను రాంచ‌ర‌ణ్ కు వినిపించ‌గా..స్క్రిప్ట్ ఒకే చేశాడ‌ట‌.

మ‌రోవైపు భీష్మ చిత్రంతో హిట్టు కొట్టిన వెంకీ కుడుముల ఇటీవ‌లే ఓ క‌థ‌ను రాంచ‌ర‌ణ్ కు వినిపించ‌గా క‌థ ఇంప్రెస్ చేయ‌లేద‌ట‌. వెంట‌నే డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల ఇదే స్టోరీని మ‌హేశ్ బాబు దృష్టికి తీసుకెళ్లిన‌ట్టు టాక్ న‌డుస్తోంది. ఫ‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఉన్న వెంకీ క‌థ‌తో సినిమా చేసేందుకు మ‌హేశ్ సుముఖంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి టాలీవుడ్ స్టార్ హీరోలు రాంచ‌ర‌ణ్, మ‌హేశ్ ఒక‌రికొక‌రు త‌మ డైరెక్ట‌ర్లను మార్చుకున్నారంటూ ఇపుడు ఫిలింన‌గ‌ర్ లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD