తమిళ హీరో కార్తికి తెలుగు అంటే చాలా ఇష్టం. అందుకే రెండో సినిమాకే ఈయన తెలుగు నేర్చుకున్నాడు. తన సినిమాలకు డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టాడు. అన్న సూర్య కంటే స్పష్టంగా తెలుగు నేర్చుకున్నాడు కార్తి. అంతేకాదు ఈయన తన సినిమాలకు టైటిల్స్ కూడా ఇదివరకు వచ్చినవే ఎంచుకుంటాడు. ఇప్పటి వరకు కార్తి సినిమాలు తెలుగులో 10 వరకు విడుదలై ఉంటాయి. అందులో 6 సినిమాలకు పాత టైటిల్స్ పెట్టారు. తాజాగా ఈయన సర్దార్ గా వస్తున్నాడు. ఈ సినిమా కంటే ముందు 5 సార్లు ఈయన సినిమాలకు పాత టైటిల్స్ పెట్టారు. మరి అవేంటో.. ఎన్నిసార్లు అలా వచ్చాడో చూద్దాం..