గురువారం 28 మే 2020
Cinema - Apr 26, 2020 , 23:54:17

ఓటీటీ ప్రభావం ఉండదు

ఓటీటీ ప్రభావం ఉండదు

‘భవిష్యత్తులో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ప్రభావం థియేటర్లపై  పెద్దగా ఉండదనుకుంటున్నాను.   డిజిటల్‌తో పోలిస్తే బిగ్‌స్క్రీన్‌లో సినిమా చూస్తున్నప్పుడు కలిగే అనుభూతి వేరుగా ఉంటుంది. థియేటర్‌కు మరో ప్రత్యామ్నాయం లేదు’ అని అన్నారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌. నేడు  ఆయన జన్మదినం. ఈ సందర్భంగా బెక్కెం వేణుగోపాల్‌ మాట్లాడుతూ ‘గతంలో ఇంటర్నెట్‌ మొదలైన తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు  రారని  అన్నారు. ఆ ప్రభావం లేకుండా ఆడియెన్స్‌ సినిమాల్ని థియేటర్లలోనే చూస్తూ ఎంజాయ్‌చేస్తున్నారు. థియేటర్ల ద్వారా తక్కువ వ్యయంతో ఎక్కువ వినోదాన్ని పొందుతున్నారు. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్లీ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. కరోనా ప్రభావం చిత్ర పరిశ్రమతో పాటు అన్ని రంగాలపై  ఉంది. అందరూ కలిసి ఈ వైరస్‌ నిర్మూలనకు పోరాటం చేయాలి. ప్రభుత్వ సూచనల్ని పాటిస్తూ నేను ఇంట్లోనే ఉంటున్నాను.  పుట్టినరోజును కుటుంబసభ్యులతో ఇంట్లోనే జరుపుకుంటున్నాను. ప్రస్తుతం విశ్వక్‌సేన్‌ హీరోగా ‘పాగల్‌' అనే సినిమాను నిర్మిస్తున్నాను. నరేష్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత చిత్రీకరణ ప్రారంభిస్తాం. అలాగే శ్రీవిష్ణు హీరోగా ప్రదీప్‌ అనే కొత్త దర్శకుడితో మరో సినిమాను తెరకెక్కించనున్నాం. నూతన తారాగణంతో ‘రోటీ- కపడా -రొమాన్స్‌' అనే సినిమాను చేయబోతున్నాను. నిర్మాత దిల్‌రాజుతో కలిసి కొన్ని సినిమాల్ని నిర్మిస్తున్నాను’ అని తెలిపారు. 


logo