బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Oct 05, 2020 , 11:24:41

సుశాంత్ కేసులో ఎయిమ్స్ రిపోర్ట్.. స్పందించిన శివ‌సేన ఎంపీ

సుశాంత్ కేసులో ఎయిమ్స్ రిపోర్ట్.. స్పందించిన శివ‌సేన ఎంపీ

హైద‌రాబాద్‌:  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ఎయిమ్స్ వైద్యుడు సుధీర్ గుప్తా ఇచ్చిన నివేదికపై శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ స్పందించారు.  సుశాంత్ కేసులో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని, ముంబై పోలీసుల‌ను కుట్ర ప్ర‌కారం త‌ప్పుప‌డుతున్నారని ఆయ‌న ఆరోపించారు.  ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడిక‌ల్ బోర్డు డాక్ట‌ర్ సుధీర్ గుప్తా త‌న నివేదిక‌లో సుశాంత్‌ది హ‌త్య కాదు అని, ఆత్మ‌హ‌త్యే అని తేల్చారు.   అయితే డాక్ట‌ర్ సుధీర్‌కు శివ‌సేన‌తో రాజ‌కీయ సంబంధాలు లేవ‌ని ఆయ‌న వెల్ల‌డించారు.  సీబీఐ నివేదిక ప్ర‌కారం సుశాంత్‌ది ఆత్మ‌హ‌త్య అని తేలింద‌ని, ఇప్పుడు సీబీఐ ఇచ్చిన నివేదిక‌ను న‌మ్మ‌క‌పోతే ఎలా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.  

ఎయిమ్స్ వైద్యుల బృందం ఇటీవ‌ల సుశాంత్ పోస్టుమార్ట‌మ్‌ను మ‌ళ్లీ నిర్వ‌హించారు. అందుబాటులో ఉన్న 20 శాతం విసెరా ఆధారంగా వైద్యులు రిపోర్ట్‌ను త‌యారు చేశారు.  అయితే వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఎయిమ్స్ వైద్యులు సుశాంత్ మృతి కేసులో అధికారికంగా ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. రిపోర్ట్‌ను అందుకున్న సీబీఐ కూడా సుశాంత్ మృతి కేసుకు సంబంధించి ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.  సుశాంత్ పోస్టుమార్ట‌మ్ నివేదిక అంశంలో డాక్ట‌ర్ సుధీర్ యూ ట‌ర్న్ తీసుకున్న‌ట్లు ఓ మీడియా సంస్థ ఆరోపిస్తున్న‌ది. సుశాంత్ మృత‌దేహానికి కూప‌ర్ హాస్పిట‌ల్ డాక్ట‌ర్లు అటాప్సీ నిర్వహించారు.  అయిదుగురు స‌భ్యుల బృందంలో ఒక్క‌రు మాత్ర‌మే జూనియర్ స్థాయి ఫోరెన్సిక్ డాక్ట‌ర్ ఉన్నార‌ని, మిగితా న‌లుగు మెడిక‌ల్ ఆఫీస‌ర్లు మాత్ర‌మే అని, ఫోరెన్సిక్ స్పెష‌లిస్టులు లేని ఆ ప్యాన‌ల్‌ను గ‌తంలో డాక్ట‌ర్ సుధీర్ త‌ప్పుప‌ట్టారు. కానీ ఇప్పుడు ఎయిమ్స్ డాక్ట‌ర్ యూ ట‌ర్న్ తీసుకున్న తీరుపై ఆందోళ‌న వ్య‌క్తం అవుతున్న‌ది.


logo