సోమవారం 25 జనవరి 2021
Cinema - Jan 14, 2021 , 17:13:35

ఒక‌ప్పుడు ఐర‌న్ లెగ్‌..కానీ ఇపుడు గోల్డెన్ లెగ్‌..!

ఒక‌ప్పుడు ఐర‌న్ లెగ్‌..కానీ ఇపుడు గోల్డెన్ లెగ్‌..!

శృతిహాస‌న్..అన‌గ‌న‌గా ఓ ధీరుడు చిత్రంతో తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైంది.అయితే ఈ సినిమా బాక్సాపీస్ వ‌ద్ద ప‌రాజ‌యాన్నిమూట‌క‌ట్టుకుంది. ఆ త‌ర్వాత తెలుగు, త‌మిళ చిత్రాల్లో న‌టించినా శృతిహాస‌న్ ఖాతాలో మంచి హిట్ ప‌డ‌లేదు. గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రం శృతిహాస‌న్ కు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్‌చిత్రంగా నిలిచింది. శృతిహాస‌న్ ను ఐర‌న్ లెగ్ గా భావించిన మేక‌ర్స్ ఆమెను తీసుకునేందుకు రెడీ లేక‌పోవ‌డంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ కార‌ణంగానే శృతిహాస‌న్ ను హీరోయిన్ గా ఫైన‌ల్  చేశార‌ట మేక‌ర్స్ ‌.

గ‌బ్బ‌ర్ సింగ్ త‌ర్వాత అప్ప‌టివ‌ర‌కు ఫ్లాప్స్ తో ఉన్న ప‌వ‌న్ కు శృతి వ‌చ్చిన వేళా విష‌యం..ఇండ‌స్ట్రీ రికార్డులు కొల్ల‌గొట్టి మంచి స‌క్సెస్ ను అందుకున్నాడు. మ‌రోవైపు బ‌లుపు చిత్రానికి ముందుకు ర‌వితేజ‌కు స‌రైన హిట్ లేదు. శృతిహాస‌న్ ఎంట్రీ అవ్వ‌గానే బ‌లుపు చిత్రంతో ర‌వితేజ‌కు మంచి హిట్టు ప‌డింది. ఈ సంక్రాంతికి విడుద‌లైన క్రాక్ సినిమాకు ముందు ర‌వితేజ 5 ఫ్లాప్స్ చ‌విచూశాడు. మ‌ళ్లీ శృతిహాస‌న్ బోర్డుపైకి రాగానే బ్లాక్ బాస్ట‌ర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు.


అలాగే శ్రీమంతుడు చిత్రానికి ముందుకు మ‌హేశ్‌బాబు రెండు చిత్రాలు ఫ్లాప‌య్యాయి. శృతిహాస‌న్ ఎంట‌ర్ అవ‌గానే మ‌హేశ్ బాబుకు శ్రీమంతుడు ఓ బ్లాక్ బాస్ట‌ర్ హిట్టుగా నిలిచిపోయింది. ఇలా కెరీర్ లో ఫ్లాప్స్ లో ఉన్న హీరోల‌కు నేనున్నానంటూ వ‌చ్చి హిట్ సినిమాల‌నందిస్తూ..ఒక‌ప్పుడు ఐర‌న్ లెగ్ అనుకున్న వాళ్లే శృతిహాస‌న్ ది గోల్డెన్ లెగ్ అని చెప్పుకునేలా చేసింది క‌మ‌ల్‌హాస‌న్ గారాల కూతురు.

ఇవి కూడా చ‌ద‌వండి

జాక్వెలిన్ పోజుల‌కు ఇంటర్ నెట్ షేక్..ఫొటోలు వైర‌ల్‌

ఒకే ఫ్రేమ్‌లో 'వ‌రుడు కావ‌లెను' ఫ్యామిలీ

మంచులో వ‌ణుకుతూ 'న‌దిలా న‌దిలా' మేకింగ్ వీడియో

ఆర్ఆర్ఆర్ లో సముద్ర‌ఖనికి ఛాన్స్ ఎలా వ‌చ్చిందంటే..?

బాలీవుడ్ సినిమాపై రామ్ క్లారిటీ..!

జాన్వీ క‌పూర్ షూటింగ్‌ను అడ్డుకున్న రైతులు

ప్ర‌భాస్ ' స‌లార్' కు ముహూర్తం ఫిక్స్


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo