గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Oct 15, 2020 , 19:35:28

థియేట‌ర్ లో బొమ్మపడాలంటే..ఆగాల్సిందే !

థియేట‌ర్ లో బొమ్మపడాలంటే..ఆగాల్సిందే !

కరోనా లాక్‌డౌన్‌తో మూతపడ్డ‌ సినిమా థియేటర్లను ఈ నెల 15నుంచి (నేటి నుంచి) ప్రారంభించుకునేందుకు కేంద్రప్రభుత్వం అనుమతిచ్చినా.. రాష్ట్రం ప్రభుత్వం సుముఖంగా వున్నా రాష్ట్రంలో థియేటర్ యజమాన్యాలు అందుకు సిద్ధంగా లేవు.థియేటర్లు తెరిచినా ప్రదర్శించుకోవడానికి కొత్త సినిమాలేవీ లేకపోవడం అందుకు ప్రధాన కారణం. అంతేకాకుండా యాభై శాతం ఆక్యుపెన్సీ పరిమితితో థియేటర్ల నిర్వహణ భారం కూడా సాధ్యం పడదనేది వారి మరో వాదన. కరోనాతో నిలిచిన సినిమా చిత్రీకరణలు ఇపుడిప్పుడే మొదలవుతున్నాయి.

అయితే సినిమాలు విడుదలకు సిద్ధంగా వున్న నిర్మాతలు విడుదల తేదీని ప్రకటించడానికి జంకుతున్నారు. పరిస్థితులు అన్నీ కుదిరితే దీపావళి వరకు థియేటర్లు ప్రారంభించాలనే ఆలోచనలో వున్నారు ఎగ్జిబిటర్లు. అయితే తొలిరోజు రెండు తెలుగు రాష్ర్టాల్లో బొమ్మపడకపోవడంతో సినీ ప్రియులు కాస్త నిరాశ చెందారు. సో..థియేటర్లో బొమ్మపడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo