కరోనా మొదటి వేవ్ ఏమో కానీ థియేటర్ వ్యవస్థ, సినిమా ఇండస్ట్రీపై సెకండ్ వేవ్ పెద్ద దెబ్బ కొట్టింది. తొలి విడతలో మరణాలు తక్కువగా ఉన్నాయి.. పవర్ కూడా తక్కువగానే ఉంది. కానీ సెకండ్ వేవ్ మాత్రం ఉన్నది మూడు నెలలే అయినా కూడా చాలా బలంగా ఉంది. మరణాలు కూడా చాలానే ఉన్నాయి. అందుకే థియేటర్స్ ఒక్కటే కాదు అన్ని క్లోజ్ చేసారు. ముఖ్యంగా కరోనా మొదటి వేవ్ అయిపోయిన 7 నెలలకు థియేటర్స్ తెరిచారు. గత డిసెంబర్ లో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ తెరిచారు. కానీ తెరిచింది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.
కరోనా దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 200 థియేటర్స్ శాశ్వతంగా మూసేసారు. జనవరి నుంచి టైమ్ బాగుంది.. మార్చి నాటికి అంతా సెట్ అయింది.. ఇంక ఏప్రిల్ నుంచి వరసగా సినిమాలు వస్తున్నాయి పండగ చేసుకోవచ్చు అనుకుంటున్న తరుణంలో మరోసారి కోవిడ్ వచ్చేసింది.సెకండ్ వేవ్ ఎవరూ ఊహించని స్థాయిలో ఇండియాపై కన్నెర్ర జేసింది. దాంతో ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న థియేటర్స్ వ్యవస్థపై మరోసారి కోలుకోలేని దెబ్బ పడిపోయింది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే ఇప్పట్లో ఇవి ఓపెన్ కావడం కలగానే కనిపిస్తుంది. సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుతూ వస్తుంది. రోజుకు ఒకప్పుడు 4 లక్షల కేసులు వచ్చిన రోజుల నుంచి లక్షకు దిగువగా కేసులు వచ్చాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం థియేటర్స్ ఇప్పట్లో ఓపెన్ అయ్యేలా కనిపించడం లేదు. ఒకవేళ తెరిచినా కూడా ముందులా ప్రేక్షకులు వస్తారనే గ్యారెంటీ లేదు. సెకండ్ వేవ్ ఎలా ఉంటుందో తెలియక మొన్నటి వరకు ఆడియన్స్ వచ్చారు. కానీ సెకండ్ వేవ్ తీవ్రత చూసిన తర్వాత థర్డ్ వేవ్ ఊహించుకుంటూనే భయంగా ఉంది.
అందుకే ఇప్పట్లో థియేటర్స్ తెరుస్తారా అనేది అనుమానమే. పరిస్థితులు చూస్తుంటే థియేటర్స్ మరికొన్ని నెలల వరకు కూడా తెరుచుకోవడం కష్టమే అంటున్నారు. అలాంటప్పుడు మరోసారి ఎగ్జిబిటర్లకు నరకమే. దసరా వరకు పరిస్థితులన్నీ చక్కబడతాయనే నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు. అప్పటి వరకు సినిమా విడుదలలు కూడా ఏం పెట్టుకోవడం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే థియేటర్ వ్యవస్థ కోలుకోవాలంటే మరో నాలుగు నెలల సమయం అయితే కచ్చితంగా పడుతుందని నిపుణుల అంచనా.
ఇవి కూడా చదవండి..
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!
మహేష్ బాబు ఓల్డ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
మరో యువ హీరో దగ్గరికి నితిన్ కథ..!
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు!
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!
Recommended Content by ntnews.comSkip Ad