కరోనా కారణంగా కొంత కాలం నుంచి థియేటర్లు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.. సినిమా హాళ్లు మూతపడటంతో థియేటర్ల యాజమాన్యాలు తీవ్రంగా నష్టపోతున్నారు. సమ్మర్లో వరుస సినిమాల రిలీజ్‌తో సినిమా హాళ్లు కళకళలాడేవి. కానీ కరోనా, లాక్డౌన్ కారణంగా కొంతకాలంగా థియేటర్లు మూతబడ్డాయి. కొన్ని సినిమాలు ఓటీటీల్లో రిలీజైనప్పటికీ.. చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో పాటు ఇప్పుడు మళ్లీ థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. దీంతో దర్శక నిర్మాతలు తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నుంచి వరుస సినిమాలు విడుదల కాబోతున్నాయి.
సత్యదేవ్ నటించిన తిమ్మరుసు సినిమా ఈ వారమే విడుదల కానుంది.శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాక్సివాలా ఫేమ్ ప్రియాంక జవాల్కర్ హీరోయిన్గా నటించింది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ మధ్య రిలీజైన ట్రైలర్ కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది.
జాంబీరెడ్డితో హీరోగా మారిన తేజా సజ్జా, వింక్ గర్ల్ ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఇష్క్ : ఇట్స్ నాట్ ఎ లవ్‌స్టోరీ కూడా ఈ వారమే విడుదల కానుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను అదే టైటిల్‌తో రీమేక్ చేశారు. సూపర్ గుడ్ ఫిలిం బ్యానర్‌పై ఆర్బీ చౌదరి ఈ సినిమాను నిర్మించాడు. ఇద్దరు ప్రేమికులు రాత్రి సమయంలో బయటకు వెళ్లినప్పుడు వాళ్లకు ఎటువంటి వ్యక్తులు ఎదరుయ్యారు? వాళ్ల వల్ల ఆ జంట ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? ఆ తర్వాత ఏం చేశారనే స్టోరీతో ఈ సినిమా తెరకెక్కింది. ఇవే కాకుండా జూలై 30న నరసింహాపురం, పరిగెత్తు పరిగెత్తు, త్రయం సినిమాలు కూడా విడుదలవుతున్నాయి.
ఆగస్టు మొదటి వారంలో కిరణ్ అబ్బవరం నటించిన SR కళ్యాణమండపం, శ్రీనివాస్ రెడ్డి నటించిన ముగ్గురు మొనగాళ్లు, ఇప్పుడు కాక ఇంకెప్పుడు, మెరిసే మెరిసే సినిమాలు విడుదల కానున్నాయి. ఇక ఆగస్టు రెండో వారంలో పూర్ణ టైటిల్ రోల్లో నటించిన సుందరి, మేఘా ఆకాశ్ నటించిన డియర్ మేఘా రిలీజయ్యే అవకాశం ఉంది. సందీప్ కిషన్ నటించిన గల్లీ రౌడీ, విశ్వక్సేన్ పాగల్, మారుతి మంచి రోజులొచ్చాయి సినిమాలు కూడా ఆగస్టులోనే విడుదలయ్యే అవకాశం ఉంది.
థియేటర్లు రీఓపెన్ అవుతున్నాయి. సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. రేపటి నుంచి తెలంగాణలో 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ అయితే.. ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడిచే అవకాశం ఉంది. కానీ ఇక్కడే అసలు సమస్య ఉంది. కరోనా భయంతో అసలు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? లేదా ? అనేదే ఇప్పుడు అసలు సమస్యగా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సిల్క్ స్మితను కొట్టే ఆడది లేదు.. శ్రీదేవి కూడా ఆమెనే ఫాలో అయ్యేది.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు
మళ్లీ ఎమోషనల్ అయిన ఆర్.నారాయణమూర్తి..
దానికే మా ఓటు.. రూటు మారుస్తున్న అందాల భామలు
రెండో పెళ్లికి సిద్ధమైన అక్కినేని మనుమడు.. నెట్టింట పెళ్లి కార్డు వైరల్
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మూడు రోజుల్లో బిగ్ అప్డేట్