శనివారం 06 జూన్ 2020
Cinema - May 22, 2020 , 12:05:29

ఆగ‌స్ట్ నుండి థియేట‌ర్స్ రీ ఓపెన్‌..!

ఆగ‌స్ట్ నుండి థియేట‌ర్స్ రీ ఓపెన్‌..!

క‌రోనా నియంత్ర‌ణ‌లో భాగంగా ప్ర‌భుత్వం రెండు నెల‌ల‌పాటు లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. దీంతో   షాపులు, మాల్స్‌, థియేట‌ర్స్, ర‌వాణా వ్య‌వ‌స్థ‌, షూటింగ్స్ ఇలా అన్నింటికి బ్రేక్ పడింది. ఇక ఇప్పుడిప్పుడే అన్నింటికి స‌డ‌లింపు ఇస్తుండడంతో థియేట‌ర్స్ కూడా త్వ‌ర‌లో ఓపెన్ అవుతాయ‌ని సినీ ప్రియులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. 

మే 21న చిరంజీవి ఇంట్లో త‌ల‌సానితో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సినిమా షూటింగ్స్‌తో పాటు థియేట‌ర్స్ రీ ఓపెన్ గురించి కీల‌క చ‌ర్చ‌లు జ‌రిపిన విష‌యం తెలిసిందే.  సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఈ విష‌యాల‌పై త్వ‌ర‌లోనే క్లారిటీ ఇస్తాన‌ని త‌ల‌సాని స్ప‌ష్టం  చేశారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఆగ‌స్ట్‌లో ఇటు తెలంగాణ అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో థియేట‌ర్స్ ఓపెన్ అవుతాయ‌నే టాక్ వినిపిస్తుంది. సింగిల్ స్క్రీన్‌లో ప్ర‌తి రోజు మూడు షోస్ ఉండేలా నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలుస్తుంది. ఈ వార్త‌పై పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది. 


logo