శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Sep 18, 2020 , 00:09:09

అక్టోబర్‌లో థియేటర్లు రీఓపెన్‌?

అక్టోబర్‌లో థియేటర్లు రీఓపెన్‌?

కరోనా ప్రభావంతో గత ఆరు నెలలుగా దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌లు, థియేటర్లు మూతపడ్డాయి. ఆర్థిక వ్యవస్థను తిరిగి బలోపేతం చేసే చర్యల్లో భాగంగా అన్‌లాక్‌ ప్రక్రియలో అనేక రంగాలను ప్రభుత్వం తిరిగి ప్రారంభిస్తోంది.  ఈ నేపథ్యంలో  థియేటర్ల పునఃప్రారంభానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగినా కార్యరూపం దాల్చలేదు. గత కొన్ని రోజులుగా థియేటర్లను రీఓపెన్‌ చేయాలంటూ  వివిధ భాషలకు చెందిన దర్శకనిర్మాతలు, ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. థియేటర్ల మూసివేత కారణంగా వందల కోట్లలో నష్టపోవడంతో పాటు లక్షలాది మంది ఉపాధికి దూరమవుతున్నారని,  అందుకేథియేటర్లను ప్రారంభించాలంటూ సేవ్‌ థియేటర్స్‌ పేరుతో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వాలకు విన్నవిస్తున్నారు. తాజాగా అక్టోబర్‌ 1 నుంచి థియేటర్లను తెరిచేందుకు హోమంత్రిత్వశాఖ మార్గదర్శకాలను సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కఠిన భద్రతాచర్యలతో అనుమతులు మంజూరు చేసినట్లు సోషల్‌మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఖండించింది.   థియేటర్ల అనుమతుల విషయంలో హోంమంత్రిత్వశాఖ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని వెల్లడించింది. ఈ వార్తల్లో నిజం లేదని తేల్చిచెప్పింది.