శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Apr 25, 2020 , 23:23:45

థియేటర్‌ బిజినెస్‌కు నష్టం ఉండదు

థియేటర్‌ బిజినెస్‌కు నష్టం ఉండదు

కరోనా ప్రభావం సినీ పరిశ్రమపై తాత్కాలికంగానే ఉంటుందని, భవిష్యత్తులో థియేటర్‌ వ్యాపారానికి ఏమాత్రం ఢోకా ఉండదని భరోసానిచ్చారు అగ్ర నటుడు కమల్‌హాసన్‌. చెన్నైలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాత్రికేయులతో ముచ్చటించిన ఆయన    ‘కరోనా వల్ల థియేటర్‌ బిజినెస్‌కు  నష్టం జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. భారతీయ ప్రజలు సమూహంతో కలిసి పెద్దతెర మీద సినిమాలు చూడటాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. లాక్‌డౌన్‌ను ఎత్తేసిన అనంతరం ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. వైద్య నిపుణులతో చర్చించి థియేటర్లలో సినిమా ప్రదర్శనలకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేయాలి’ అన్నారు. ప్రస్తుతం కమల్‌హాసన్‌ ‘ఇండియన్‌-2’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.


logo