ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Cinema - Aug 08, 2020 , 11:39:57

'క‌న‌బ‌డుటలేదు' టీజ‌ర్ లాంచ్ చేసిన సుకుమార్

'క‌న‌బ‌డుటలేదు' టీజ‌ర్ లాంచ్ చేసిన సుకుమార్

అప్‌క‌మింగ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌న‌బ‌డుట‌లేదు చిత్ర టీజ‌ర్ .. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కొద్ది సేప‌టి క్రితం విడుద‌ల చేశారు. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. తప్పిపోయిన వ్యక్తి, రెండు మృతదేహాలు వాటికి సంబంధించి అనుమానితుల‌ని విచారించడం వంటి   నేపథ్యంతో సినిమాని తెర‌కెక్కించిన‌ట్టు టీజ‌ర్‌ని బ‌ట్టి తెలుస్తుంది. 

సుక్రాంత్ వీరెల్ల హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి బాలరాజు దర్శకత్వం వహించారు.  మర్డర్ మిస్టరీ నేపథ్యంలో రూపొందిన ఈ  సినిమాకు మధు పొన్నాస్ సంగీతం సమకూర్చగా, సందీప్ బద్దుల సినిమాటోగ్రఫీ అందించారు. సరయు తలశిల సమర్పణలో ఎస్.ఎస్. ఫిలిమ్స్, శ్రీపాద క్రియేషన్స్, షేడ్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. యుగ్రం, శ‌శిత కోన‌, నీలిమ , సౌమ్య శెట్టి, కేరాఫ్ కంచెర‌పాలెం ఫేం రాజు త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించారు logo