మాధవ్ చిలుకూరి, స్పందన, రజత్ రాఘవ్, శ్వేతవర్మ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యాడ్’. లక్ష్మణ్ మేనేని దర్శకుడు. మోదెల టాకీస్ పతాకంపై టి.వేణుగోపాల్‌రెడ్డి, బి.కృష్ణారెడ్డి నిర్మించారు. ఈ నెల 6న ప్రేక్షకులముందుకురానుంది. బుధవారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘వివాహ బంధంలోని సంఘర్షణ, సమస్యల్ని ఈ సినిమాలో ఆవిష్కరించాం. నా మిత్రుల సహకారంతో సినిమాను పూర్తిచేశా. రెండు జంట కథలతో ఓ ఉత్సవంలా సాగే చిత్రమిది’ అన్నారు. తమ పదేళ్ల కల ఈ సినిమా రూపంలో నెరవేరిందని, టీమ్ అంతా మనసు పెట్టి ప్రాజెక్ట్ పూర్తిచేశారని నిర్మాత కృష్ణారెడ్డి తెలిపారు. సినిమాలోని సూఫీ గీతాన్ని కైలాష్‌ఖేర్ అద్భుతంగా ఆలపించారని సంగీత దర్శకుడు మోహిత్ రెహ్మానియానిక్ చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూప పాల్గొన్నారు.