గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 19, 2020 , 17:35:49

తన ఫ్యాన్ కు టీవీ గిఫ్ట్ గా ఇచ్చిన సీరియల్ నటి...ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు...?

తన ఫ్యాన్ కు టీవీ గిఫ్ట్ గా ఇచ్చిన సీరియల్ నటి...ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు...?

హైదరాబాద్ : ప్రతి ఏడాది రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఐపీఎల్ మ్యాచ్ లు ఈ సీజన్ లో మాత్రం అరగంట ముందుగా అంటే 7.30 కు మొదలు కానున్నాయి అని చెప్పారు. ఈ ప్రకటన తర్వాత శివచరణ్‌ అనే ఐపీఎల్ అభిమాని గంగూలీని ట్విట్టర్ వేదికగా ఓ రిక్వెస్ట్ చేసాడు. అదేంటంటే... గంగూలీ సార్ ఐపీఎల్ టైం ను 7.30 నుండి 8 కి మార్చండి. ఎందుకంటే 7.30 కు మా ఇంట్లో "కార్తీక దీపం" అనే ఓ సీరియల్ వస్తుంది. దాని మా ఇంట్లో అందరూ చూస్తారు. అయితే మాకు ఒకటే టీవీ ఉంది. అందుకే ఐపీఎల్ టైం ను మార్చండి. లేదంటే టీవీ కోసం మా ఇంట్లో గొడవలు జరుగుతాయి'' అని తెలిపాడు.

అయితే ఈ ట్విట్ పై ఆ సంబంధిత సీరియల్ ప్రసారం అవుతున్న చానెల్ స్పందిస్తూ... ''నిజమైన అభ్యర్థన లాగానే కనిపి స్తున్నది'' అని రిప్లై ఇచ్చింది. దాంతో ఈ ట్విట్ కాస్త వైరల్ గా మారి... ఆ ట్విట్ కార్తీక దీపంలో లీడ్ రోల్ లో నటిస్తున్న దీప(ప్రేమి విశ్వనాథ్‌) కంట పడింది. ఒక సీరియల్ ను ఇంతలా అభినందిస్తారా అంటూ ఐపీఎల్ టైమింగ్స్ మార్చడం కుదరని పని అని తెలుసుకున్న దీప తమ సీరియల్ అభిమాని ఇంట్లో గొడవలు రాకూడదని ఒక లెటర్ తో పాటుగా 32 అంగుళాల టీవీని కొని శివచరణ్‌ ఇంటికి పంపించింది. ఇక ఆ ఇంట్లో గొడవ పడకుండా ఓ టీవీ లో కార్తీక దీపం మరో టీవీ లో ఐపీఎల్ లు మ్యాచ్ లు చూడవచ్చు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo