గురువారం 04 జూన్ 2020
Cinema - Mar 19, 2020 , 01:47:52

విజయ’ రహస్యం అదే

విజయ’ రహస్యం అదే

అసమాన అభినయం, విలక్షణ వ్యక్తిత్వంతో అచిరకాలంలోనే తెలుగులో చిత్రసీమలో అగ్రకథానాయకుడిగా పేరుతెచ్చుకున్నారు విజయ్‌దేవరకొండ. విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ  యువతరంలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. తాజాగా ఓ ఆంగ్ల వార్త పత్రిక నిర్వహించిన టాలీవుడ్‌ ‘30 మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌ 2019’ జాబితాలో విజయ్‌దేవరకొండ మొదటిస్థానంలో నిలిచారు. ఈ లిస్ట్‌లో నంబర్‌వన్‌ ర్యాంకును  విజయ్‌ దేవరకొండ సొంతం చేసుకోవడం ఇది రెండోసారి. 2018లోనూ ఆయన మొదటిస్థానంలో నిలిచారు. రొటీన్‌కు భిన్నమైన  ఇతివృత్తాల్ని ఎంపికచేసుకోవడం,పూర్తివిశ్వాసంతో ఎంచుకున్న రంగంలో శ్రమించడమే తన విజయరహస్యాలుగా భావిస్తానని విజయ్‌దేవరకొండ చెబుతున్నారు. ఫ్యాషన్స్‌ విషయంలో తన ఆలోచనే తాను ధరించే డెస్సింగ్‌ ైస్టెల్‌ను నిర్ణయిస్తుందని  చెబుతున్నారు.   ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియన్‌ చిత్రంలో  నటిస్తున్నారు విజయ్‌దేవరకొండ. ఇటీవల ముంబాయిలో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు.  


logo