శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Oct 03, 2020 , 02:17:11

అదే నిజమైన అందం!

అదే నిజమైన అందం!

స్వీయలోపాల్ని తెలుసుకోవడంలోనే అసలైన విజ్ఞత, విజయరహస్యం దాగి ఉంటాయని చెబుతోంది గోవా భామ ఇలియానా. ఒకప్పుడు దక్షిణాదిన అగ్ర కథానాయికగా చలామణీ అయిన ఈ సొగసరి ప్రస్తుతం కెరీర్‌లో పూర్తిగా వెనకబడిపోయింది. తాజా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో ఈ అమ్మడు అందం గురించి ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ చేసింది. చూసే కళ్లను బట్టి అందానికి సంబంధించిన దృష్టికోణం మారిపోతుందని వివరించింది. ‘కెరీర్‌ ఆరంభంలో నా శరీరసౌష్టవాన్ని చూసి ఎప్పుడు బాధపడేదాన్ని. అవయవాల అమరిక పొందికగా లేదనే అసంతృప్తి వెంటాడేది. ముఖ్యంగా ఎత్తు తక్కువగా ఉన్నానని,  అంతగా ఆకర్షించే ముఖం కాదనే భావనలో ఉండేదాన్ని. అయితే క్రమంగా నిజమైన అందం అంటే ఏమిటో తెలుసుకున్నా. ఈ ప్రపంచంలో  ఎవరూ పర్‌ఫెక్ట్‌ కాదని..లోపాల్ని కూడా జీవితానికి అనుగుణంగా మార్చుకోవడంలోనే అందం, ఆనందం దాగి ఉందని బోధపడింది. లోపాలున్నా ప్రతి ఒక్కరిలో ఏదో తెలియని అందం ఉంటుందని అర్థం చేసుకున్నా. ఆత్మవిశ్వాసంతో జీవితంలో రాణించాలనే నిజాన్ని గ్రహించా’ అని ఇలియానా చెప్పింది.