సోమవారం 26 అక్టోబర్ 2020
Cinema - Jul 15, 2020 , 23:28:37

ఆ రహస్యం తెలుసు

ఆ రహస్యం తెలుసు

బాలీవుడ్‌ చిత్రసీమలో అసూయద్వేషాలు  ఎక్కువేనని చెబుతోంది సుస్మితాసేన్‌. ఆ రహస్యం అందరికి  తెలుసునని అంటోంది. నటనకు చాలా కాలంగా దూరంగా ఉన్న ఆమె ఇటీవల ‘ఆర్య’ వెబ్‌సిరీస్‌లో నటించింది. ఈ వెబ్‌సిరీస్‌కు ముందు చాలా సినిమాల్లో, సిరీస్‌లలో అవకాశాలు వచ్చాయని, కానీ అవేవీ తన మనసుకు నచ్చకపోవడంతో తిరస్కరించానని  పేర్కొన్నది.  సుస్మితాసేన్‌ మాట్లాడుతూ ‘వచ్చిన అవకాశాల్ని తిరస్కరించడం ఇండస్ట్రీలో సులభం కాదు. ‘నో’ చెప్పడం వల్ల ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవాల్సివుంటుంది.  పాత్రకు సరిపోనని తెలిసినా ‘నటిగా మీకో కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాం. ఇండస్ట్రీలో కొనసాగేలా  చేస్తాం’అంటూ చాలా మంది దర్శకనిర్మాతలు తమ కథలతో నన్ను సంప్రదించేవారు. నాకు సాయం చేస్తున్నట్లుగా నటించేవారు. అలాంటివి  నచ్చకే చాలా కాలం పాటు నటనకు దూరంగా ఉన్నా.  నేను చేసే తప్పుల్ని గొప్పలుగా కీర్తించే వారు కాకుండా నిర్మొహమాటంగా ముఖంపైనే చెప్పేవారితో కలిసి పనిచేయడాన్ని ఇష్టపడతా. అలాంటి వాతావరణమే నటిగా నేను ఎదగడానికి స్ఫూర్తినిచ్చింది’ అని తెలిపింది. logo