బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 06, 2020 , 14:36:56

ఈ సారి ఈగ స్టైల్‌లో .. 9పీఎం 9మినిట్స్

ఈ సారి ఈగ స్టైల్‌లో .. 9పీఎం 9మినిట్స్

ప్ర‌ముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి క‌రోనాపై అవ‌గాహ‌న క‌లిపించేందుకు  ‘స్టూడెంట్‌ నెంబర్‌ వన్‌' చిత్రంలోని ‘ఎక్కడో పుట్టి..’ అనే పాటని పేరడీగా రూపొందించిన సంగ‌తి తెలిసిందే. ‘ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి ఇక్కడే చేరింది మహమ్మారి రోగమొక్కటి. ఎక్కడివాళ్లు అక్కడే ఉండి ఉక్కు సంకల్పంతో తరుముదాం దాన్ని బయటకి. వీ విల్‌ స్టే ఎట్‌ హోమ్‌. వీ స్టే సేఫ్‌' అంటూ పాట రూపంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించారు. 

ఇక‌ ఆదివారం రాత్రి 9గంల‌.కి 9 నిమిషాల పాటు ప్ర‌తి ఒక్క‌రు దీపం వెలిగించి భార‌తీయుల ఐక్య‌త‌ని చాటిన విధానం పై సాంగ్ రూపొందించారు కీర‌వాణి.  ఈగ చిత్రం లోని అరె..అరె.. అరె పాట‌ని పేర‌డీగా మార్చి.. ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9గం.ల‌కి అద్భుత సంఘ‌ట‌నే జ‌రిగింద‌ని పాట‌గా రూపొందించారు. ఈ పాటని కాళభైర‌వ పాడారు.  ఈ పాట కూడా నెటిజ‌న్స్ ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.logo