శనివారం 30 మే 2020
Cinema - Mar 28, 2020 , 13:39:13

గృహ నిర్భందానికి గురయ్యానన్న వార్తల్లో నిజం లేదు: కమ‌ల్‌

గృహ నిర్భందానికి గురయ్యానన్న వార్తల్లో నిజం లేదు: కమ‌ల్‌

సినీ న‌టుడు, మ‌క్క‌ల్ నీధి మ‌య్య‌మ్ అధ్య‌క్షుడు క‌మ‌ల్ హాస‌న్ గృహ నిర్భంధంలో ఉన్న‌ట్టు కొద్ది రోజులుగా  పుకార్లు షికారు చేస్తున్నాయి. త‌న ఆరోగ్యం గురించి క‌నుక్కునేందుకు నాన్‌స్టాప్‌గా కాల్స్ వ‌స్తుండ‌డంతో క‌మ‌ల్ కొద్ది సేప‌టి క్రితం అధికారిక‌ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. వివ‌రాల‌లోకి వెళితే చెన్నై నగరంలోని ఆళ్వారుపేటలో ఉన్న  కమల్‌ హాసన్ ఇంటికి చెన్నై కార్పొరేషన్ అధికారులు కరోనావైరస్ రోగుల ఇళ్లకు అంటించే 'ఐసొలేషన్' (గృహ నిర్బంధం) స్టిక్కర్ అంటించారు. అయితే, పొరపాటున దీనిని అతికించామని తెలుసుకున్న అధికారులు కొన్ని గంటల వ్యవధిలోనే దానిని తొలగించారు.

క‌మ‌ల్ ఇంటికి స్టిక్ట‌ర్ అంటించిన వార్త కొద్ది నిమిషాల‌లోనే వైర‌ల్ కాగా, క‌మ‌ల్‌కి క‌రోనా సోకింద‌ని, ఆయ‌న ఐసోలేష‌న్‌లో ఉన్నాడ‌ని వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. దీనిపై వివ‌ర‌ణ ఇచ్చిన క‌మ‌ల్‌..నా ఆరోగ్యంపై మీరు చూపిస్తున్న ప్రేమ‌కి ధ‌న్యుడిని. ఆళ్వారుపేటలోని  ఇంట్లో గత కొన్నేళ్లుగా  నివసించట్లేదు. కేవ‌లం పార్టీ సమావేశాలు నిర్వహించేందుకుగాను పార్టీ కార్యాలయంగా ఉపయోగిస్తున్నాం. అంతేకాక  గృహ నిర్బంధానికి గురయ్యానన్న వార్తల్లో నిజం లేదు. ముందు జాగ్రత్తగా ప్రజలంతా ఇతరులకు దూరంగా (సోషల్ డిస్టెన్సింగ్) ఉండాలని నేను కోరాను, అదేవిధంగా నా అంతట నేనుగా ఇతరులకు దూరం పాటిస్తున్నాను. న్యూస్ ఎజెన్సీస్ వార్త‌ని ప్ర‌చురించే ముందు నిజ‌నిజ‌లాంటే తెలుసోవాల‌ని '' అని కమల్ హాసన్ స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండగా, కమల్ హాసన్ పెద్ద కుమార్తె శృతి హాసన్ రెండు వారాల కిందట ఇంగ్లండ్ నుంచి భారతదేశానికి తిరిగొచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె ముంబైలోని తన నివాసంలో ఒంటరిగా ఉంటున్నారు. కమల్ చిన్న కుమార్తె అక్షర చెన్నైలోనే మరొక ఇంట్లో నివ‌సిస్తున్నారు. కమల్ హాసన్ వేరొక ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. logo