మంగళవారం 01 డిసెంబర్ 2020
Cinema - May 11, 2020 , 14:15:32

5 కోట్ల శ్రోత‌ల హృద‌యాలు దోచుకున్న ఉప్పెన సాంగ్

5 కోట్ల శ్రోత‌ల హృద‌యాలు దోచుకున్న ఉప్పెన సాంగ్

యువ హీరో సాయిధరమ్‌తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌తేజ్ ఉప్పెన చిత్రంతో  కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకాలపై నవీన్‌ ఏర్నేని, వై.రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.  విభిన్న ఇతివృత్తంతో భావోద్వేగప్రధానంగా సాగే ప్రేమకథా చిత్రమిది. ఓ జంట ప్రేమప్రయాణానికి దృశ్యరూపంగా చిత్రం ఉంటుంద‌ని మేక‌ర్స్ అంటున్నారు . కృతిశెట్టి ఉప్పెన చిత్రంతో  కథానాయికగా పరిచయమవుతున్నది. విజయ్‌ సేతుపతి, సాయిచంద్‌, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి  దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.

ఏప్రిల్‌లో విడుద‌ల కావ‌ల‌సిన ఈ చిత్రం లాక్‌డౌన్ కార‌ణంగా వాయిదా ప‌డింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన విడుద‌లైన సాంగ్స్ కి సూప‌ర్భ్ రెస్పాన్స్ వ‌స్తుంది. చిత్రం నుండి నీ క‌న్ను నీలి స‌ముద్రం అంటూ సాగే పాట‌ని మొద‌టగా విడుద‌ల చేశారు. హిందీ, తెలుగు లిరిక్స్‌తో ఉన్న ఈ పాట‌కి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తుంది. తాజాగా ఈ పాట 50 మిలియ‌న్స్‌కి పైగా వ్యూస్ రాబ‌ట్టి అందరిని ఆశ్చ‌ర్చ‌ప‌రుస్తుంది. తెలుగు లిరిక్స్ శ్రీమ‌ణి అందించ‌గా, జావేద్ అలీ ఆల‌పించారు . ఇక హిందీ లిరిక్స్ ర‌కీబ్ అల‌మ్ అందించ‌గా, శ్రీకాంత్ చంద్ర వోక‌ల్స్ అందించారు