గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Oct 18, 2020 , 01:05:17

నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘చెక్‌'

నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘చెక్‌'

నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘చెక్‌'. చంద్రశేఖర్‌ యేలేటి దర్శకుడు. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌సింగ్‌, ప్రియాప్రకాష్‌ వారియర్‌ కథానాయికలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘చదరంగం ఆట నేపథ్యంలో సాగే కథాంశమిది. ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ జీవన ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఎత్తుకుపై ఎత్తులతో కథాగమనం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. నటుడిగా నితిన్‌ స్థాయిని పెంచే చిత్రమవుతుంది. తాజా షెడ్యూల్‌లో నితిన్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌, సాయిచంద్‌, సంపత్‌రాజ్‌లపై కీలక ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నాం. నవంబర్‌ 5వరకు ఈ షెడ్యూల్‌ కొనసాగుతుంది. దాంతో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది’ అన్నారు. పోనాని కృష్ణమురళి, మురళీశర్మ, హర్షవర్ధన్‌, రోహిత్‌, సిమ్రాన్‌చౌదరి తదితరులు చిత్ర తారాగణం.


logo