మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Oct 12, 2020 , 10:21:51

‘మహాసముద్రం’లో బాలీవుడ్ భామ‌

‘మహాసముద్రం’లో బాలీవుడ్ భామ‌

శర్వానంద్‌ హీరోగా అజయ్‌భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మ‌హా స‌ముద్రం. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇంటెన్స్‌ లవ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో  శర్వానంద్‌, సిద్దార్థ్‌ పాత్రలు పోటాపోటీగా సాగుతాయి. ప్రతిభావంతులైన నటులు ఇద్దరినీ ఒకే తెరపై చూడటం ప్రేక్షకులకు కన్నుల పండువగా ఉంటుంది. శర్వానంద్ తన కెరీర్ లో గమ్యం, ప్రస్థానం తరువాత మళ్ళీ అలాంటి బలమైన పాత్రను ఈ సినిమాలోనే చేస్తున్నాడని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇక‌ ఈ సినిమాలో శ‌ర్వానంద్ కి జ‌త‌గా అదితి రావు హైదరి నటించబోతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా మహాసముద్రం తెర‌కెక్క‌నుండ‌గా,  ఈ సినిమాను తెలుగు తమిళంలో ఒకేసారి తెరకెక్కించ‌నున్నారు. మ‌రి కొద్ది రోజుల‌లో చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళే అవ‌కాశం ఉంది. శ‌ర్వానంద్ స‌ర‌స‌న క‌థానాయిక కోసం ప‌లువురి పేర్ల‌ని ప‌రిశీలించిన చిత్ర బృందం చివ‌ర‌కు బాలీవుడ్ భామ అదితి రావు హైద‌రిని ఎంపిక చేసింది. పాత్ర‌కు ఆమె చ‌క్క‌టి న్యాయం చేయ‌గ‌ల‌ద‌ని భావించి ఈ నిర్ణ‌యం తీసుకున్నాం అని మేక‌ర్స్ పేర్కొన్నారు. చివ‌రిగా అదితి తెలుగులో వీ అనే సినిమా చేసింది. ఇందులో నాని స‌ర‌స‌న క‌థానాయిక‌గా నటించింది. logo