గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 21, 2020 , 02:20:26

రిసార్ట్‌లో దయ్యం

రిసార్ట్‌లో దయ్యం

అభినవ్‌ సర్దార్‌ పటేల్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది గోస్ట్‌ రిసార్ట్‌'. టి. లక్ష్మీసౌజన్యగోపాల్‌ నిర్మాత. సాయిరాజేష్‌ అండ్‌ టీమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  మధులగ్నదాస్‌ కథానాయిక. నిర్మాణానంతర కార్యక్రమాల్ని పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఆదివారం అభినవ్‌సర్దార్‌ పటేల్‌ జన్మదినం సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో అభినవ్‌ సర్దార్‌ మాట్లాడుతూ ‘నా పుట్టినరోజున రక్తదాన కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉంది. రిసార్ట్‌లో జరిగే అనూహ్య పరిణామాలేమిటి? దయ్యం కారణంగా ఎదురైన విపత్తును ఓ ధైర్యవంతుడైన యువకుడు ఎలా ఎదుర్కొన్నాడన్నది ఆకట్టుకుంటుంది. లాక్‌డౌన్‌కు ముందే చిత్రీకరణ పూర్తయింది’ అని తెలిపారు. హారర్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమిదని, కథను నమ్మి ఈ చిత్రాన్ని రూపొందించామని దర్శకుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్‌రాజా,  సన్నీ, షానీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: చక్రి. 


logo