గురువారం 25 ఫిబ్రవరి 2021
Cinema - Jan 23, 2021 , 00:09:26

స్వర్ణకారుల్ని కించపరిచే సినిమా కాదు

స్వర్ణకారుల్ని కించపరిచే సినిమా కాదు

‘స్వర్ణకారుల్ని కించపరిచేలా సినిమాలో ఎలాంటి సన్నివేశాలుండవు. వారి వృత్తిలోని కష్టాల్ని, గొప్పతనాన్ని చాటిచెబుతూ ఈ సినిమాను రూపొందించాం’ అని అన్నారు అల్లరి నరేష్‌. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘బంగారు బుల్లోడు’. గిరి పాలిక దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. నేడు ఈ చిత్రం విడుదలకానుంది. ప్రీరిలీజ్‌ వేడుక గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు హాజరైన దర్శకుడు అజయ్‌భూపతి మాట్లాడుతూ ‘వినోదానికే పరిమితం కాకుండా ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయగలడని నరేష్‌ నిరూపించుకున్నారు’ అని చెప్పారు. అల్లరి నరేష్‌ మాట్లాడుతూ ‘నాన్నగారితో ఎక్కువగా పల్లెటూరి నేపథ్య వినోదాత్మక చిత్రాలు చేశాను. చాలా రోజుల తర్వాత మళ్లీ ఆ శైలి కథాంశాన్ని ఎంచుకొని సినిమా చేయడం ఆనందంగా ఉంది’  అని తెలిపారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిదని దర్శకుడు అన్నారు. ‘కుటుంబమంతా కలిసి చూసేలా అల్లరి నరేష్‌ సినిమాలు ఉంటాయి. ఆ కోవలో ఈసినిమా నిలవాలి’ అని మోహర్‌ రమేష్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూజా జవేరి తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo