శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Oct 03, 2020 , 02:17:08

విశ్వకవి రవీంద్రనాథ్‌ఠాగూర్‌ భావాలతో తెరకెక్కుతున్న చిత్రం ‘దాడి

విశ్వకవి రవీంద్రనాథ్‌ఠాగూర్‌ భావాలతో తెరకెక్కుతున్న చిత్రం ‘దాడి

విశ్వకవి రవీంద్రనాథ్‌ఠాగూర్‌ భావాలతో తెరకెక్కుతున్న చిత్రం ‘దాడి’. శ్రీరామ్‌, అక్షర, జీవన్‌, కమల్‌కామరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మధు శోభ.టి దర్శకత్వం వహిస్తున్నారు. ఏ.శంకర్‌ నిర్మాత.  ఈ చిత్రంలోని ‘ఏదీ చీకటి ఏదీ మృత్యువు...’ అనే టైటిల్‌ గీతాన్ని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ విడుదలచేశారు.  మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడుతూ ‘పాట వినసొంపుగా ఉంది. సంగీతం, సాహిత్యం, చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటున్నాయి. చక్కటి ఆశయంతో శంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అందరూ ప్రోత్సహించాల్సిన అవసరముంది’ అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ ‘వాస్తవ ఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. ఈ చిత్రానికి మణిశర్మ బాణీలు, శ్యామ్‌ కె నాయుడు ఫొటోగ్రఫీ ప్రధాన బలంగా నిలుస్తాయి.  సమకాలీన సమాజంలో నెలకొన్న కులమత అంతరాలు, ఆధిపత్యపోరును చర్చిస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రం నవ్యానుభూతిని పంచుతుంది’ అని చెప్పారు.  గణేష్‌ వెంకట్రామన్‌, ముఖేష్‌ రుషి, చరణ్‌రాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు.