దేశం కోసం పోరాటం

మోహన్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డైమండ్ రత్నబాబు దర్శకుడు. బుధవారం హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. ‘దేశభక్తి ప్రధానంగా రూపొందుతున్న చిత్రమిది. దేశం కోసం ఓ వ్యక్తి ఎలాంటి పోరాటం సాగించాడన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది. తెలుగు తెరపై ఇప్పటివరకు ఎవరూ స్పృశించని కథాంశంతో రూపొందిస్తున్నాం. శక్తివంతమైన పాత్రలో మోహన్‌బాబు కనిపిస్తారు. కథానాయకుడిగా నటిస్తూనే ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను సమకూర్చారాయన. తిరుపతిలో చిత్రీకరించిన మొదటి షెడ్యూల్లో కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించాం. హైదరాబాద్‌లో ప్రారంభమైన తాజా షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై ముఖ్య ఘట్టాలను తెరకెక్కిస్తాం’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఛాయాగ్రహణం: సర్వేష్ మురారి, ైస్టెలిస్ట్: విరానికా మంచు.
తాజావార్తలు
- బడ్జెట్ 2021 : ఆర్థిక మంత్రితో సినీ ప్రతినిధుల భేటీ
- 28న మణుగూరు-సికింద్రాబాద్ రైలు పునరుద్ధరణ
- ఎంపీ అరవింద్‌ను నిలదీసిన పసుపు రైతులు
- వర్మ `డీ కంపెనీ` టీజర్ చూశారా?
- 'శివమొగ్గ పేలుడులో ఆరుగురు మృతి'
- ముత్తూట్ ఫైనాన్స్ చోరీ గుట్టురట్టు:
- మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం : మంత్రి ఈశ్వర్
- ఆకట్టుకుంటున్న అరుదైన తెల్లని కంగారు పిల్ల
- హౌరాలో తృణమూల్xబీజేపీ ఘర్షణ, పలువురికి గాయాలు
- బర్డ్ ఫ్లూతో భయాందోళనలు వద్దు