మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలలో రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ది ఫ్యామిలీ మ్యాన్ 2 రూపొందుతుంది. రెండు నెలల క్రితమే అమెజాన్ ప్రైమ్‌లో ది ఫ్యామిలీ మ్యాన్ 2 స్ట్రీమింగ్ కావలసి ఉన్నప్పటికీ , ‘మీర్జాపూర్’, ‘తాండవ్’ వెబ్‌సిరీస్‌ల వల్ల అమెజాన్ ప్రైమ్ మీద వచ్చిన విమర్శల నేపథ్యంలో కొద్ది రోజుల పాటు వాయిదా వేసినట్టు తెలుస్తుంది.
సమంత ఇందులో నెగెటివ్ పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ది ఫ్యామిలీ మ్యాన్ 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. రేపు ట్రైలర్ విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక జూన్ 4 నుండి అమెజాన్‌లో వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తుంది. ప్రియమణి, షరీబ్ హష్మి, శరద్ కేల్కర్, శ్రేయా ధన్వంతరి తదితరులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు.