మంగళవారం 26 మే 2020
Cinema - May 11, 2020 , 01:19:35

వివాదం ముగిసింది!

వివాదం ముగిసింది!

‘సినిమా రంగంలో తెలంగాణ యూనియన్లు ఎందుకు పెట్టారు’ అని ప్రశ్నించిన నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ తన మాటల్ని వెనక్కితీసుకుంటూ విచారం వ్యక్తం చేసినందుకు ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలుకుతున్నట్లు తెలంగాణ ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు ప్రేమ్‌రాజ్‌ తెలిపారు. ఎప్పటిలాగే సినీ పరిశ్రమలో అందరం అన్నదమ్ముల్లా కలిసి మెలిసి పనిచేసుకుందామని ఆయన అన్నారు. అలాగే కరోనా ఆపత్కాల సమయంలో కరోనా క్రైసిస్‌ చారిటీ (సిసిసి) ద్వారా తెలంగాణ యూనియన్లలోని కార్మికుల్ని ఆదుకున్న సీనియర్‌ హీరో చిరంజీవికి, కమిటీ పెద్దలకు ఎంతగానో రుణపడి వున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కార్మికులను సీసీసీ తరపున ఆదుకునే విషయంలో రేయింబవళ్లు ఎంతో కృషిచేసిన దర్శకుడు ఎన్‌.శంకర్‌కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ప్రేమ్‌రాజ్‌. లాక్‌డౌన్‌ ఎత్తేసే వరకు తెలంగాణ యూనియన్లలోని కార్మికులను సహాయం కొనసాగించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. 


logo