మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 27, 2020 , 19:55:08

చిన్నారిపైకి దూసుకెళ్లిన కారు..చికిత్స పొందుతూ మృతి

చిన్నారిపైకి దూసుకెళ్లిన కారు..చికిత్స పొందుతూ మృతి

నిజామాబాద్‌ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ నగరంలోని శివమ్‌ అపార్ట్‌మెంట్‌లో మనస్వి అనే చిన్నారిపైకి కారుదూసుకెళ్లింది. ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనలో గాయాలపాలైన చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్న బండకల మోహన్‌ తన భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి అక్కడే ఉంటున్నాడు.

మోహన్‌ చిన్న కూమార్తె మనస్వి (19 నెలలు) పార్కింగ్‌లో ఆడుకుంటుండగా,  బోని అనే వ్యక్తి తన కారును అజాగ్రత్తగా నడుపడంతో చిన్నారిపైకి దూసుకెళ్లింది. గాయాపాలైన చిన్నారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న మూడో టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్ఐ సంతోష్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


logo