మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Sep 19, 2020 , 18:53:36

బిగ్ బాస్ షో నుంచి ఈ సారి ఎలిమినేట్ అయ్యేదెవరో తెలుసా...?

బిగ్ బాస్ షో నుంచి ఈ సారి ఎలిమినేట్ అయ్యేదెవరో తెలుసా...?

హైదరాబాద్ :యూట్యూబ్ స్టార్ గంగవ్వ ను బిగ్ బాస్ హౌజ్ లోకి తీసుకు వచ్చి ఇంట్రస్ట్ క్రియేట్ చేద్దామనుకున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. కానీ అభం శుభం తెలియని గంగవ్వను బిగ్ బాస్ రేటింగ్ కోసం వాడుకుంటున్నారన్న వాదన వినిపిస్తుంది.మట్టి మనిషి గంగవ్వ , పచ్చటి ప్రకృతి నడుమ బ్రతికే ఆమెను ఏసీ నిండిన బిగ్ బాస్ హౌస్ లో ఉంచడం తో ఆమె అవస్థపడుతుంది. కల్మషం లేని మనసున్న గంగవ్వ , బిగ్ బాస్ లో మిగిలిన వారు చేసే ఎత్తులు పై ఎత్తులకు ఇబ్బంది పడుతుంది. గేమ్ గెలవడానికి ప్రతిఒక్కరు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటే.. అమాయకపు గంగవ్వ ఏమీ తోచక హౌస్ లో ఒంటరి అవుతుందని ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పైకి అందరూ ఆమెను బాగా చూసుకుంటున్నట్టు నటిస్తున్నా...లోపల ఆమెను ఎప్పుడెప్పుడు బయటకు పంపాలా అన్న ఆలోచనలతోనే ఉన్నారని అనిపిస్తుంది. " నేను ఇక్కడ ఉండలేను బిడ్డ నేను పోతా.." అని గంగవ్వ కన్నీళ్లు పెట్టుకున్న టీఆర్పీ కోసం ఆమెను బలవంతంగా ఉంచుతున్నారని కొందరు అంటున్నారు. కాళ్లనొప్పులతో బాధపడుతున్న నేను వెళ్లిపోతానని చెప్పినా... డాక్టర్ల పర్యవేక్షణలో గంగవ్వను కొనసాగించడం సరికాదని అంటున్నారు. గంగవ్వ పల్లె ముత్యం.. ఆమె కోసం పల్లెల్లో ఉండేవాళ్లు కూడా బిగ్ బాస్ చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా వేదికగా గంగవ్వ కోసమే బిగ్ బాస్ చూస్తున్నాం అని అంటున్నారు. ఆమెను పంపితే వ్యూవర్ షిప్ తగ్గుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.

ఇక మిగిలిన వాళ్ళు చేసే చిల్లర అల్లరి , అర్ధంపర్ధం లేని గొడవలు , పిచ్చి పిచ్చి డ్యాన్స్లు , శృతిమించిన గ్లామర్ తో బిగ్ బాస్ షో సాగుతుంధి. ఇక ఈవారం ఎలిమినేషన్ కు నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటికే 9మంది నామినేట్ అయ్యారు. వారిలో కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎలిమినేషన్ లో ఉన్న వారిలో కళ్యాణి.. కుమార్ సాయి ,సోహెల్ కు తక్కువ ఓట్లు వచ్చినట్టు తెలుస్తున్నది. మొదటినుంచి కళ్యాణి పై కుటుంబ సభ్యులంతా నెగిటివ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక కరాటేకళ్యాణి లేనిపోని విషయాలకు రాద్ధాంతం చేయడం. కదిలిస్తే ఏడవడం, గొడవకు దిగడం ప్రేక్షకులకు సైతం రోతపుట్టిస్తుందని అంటున్నారు .దాంతో ఆమెనే ఎలిమినేట్ చేయడం ఉత్తమమని నిర్వాహకులు కూడా భావిస్తున్నారని వినికిడి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


logo