ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 04, 2020 , 10:08:17

ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడికి క‌రోనా

ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడికి క‌రోనా

కరోనా మ‌హ‌మ్మారి క‌రాళ‌నృత్యం చేస్తుంది. సామాన్యులే కాక సెల‌బ్రిటీలు కూడా క‌రోనాతో ఇబ్బంది ప‌డుతున్నారు. రీసెంట్‌గా హాలీవుడ్ హీరో డ్వెయిన్ జాన్స‌న్‌.. త‌న‌తో పాటు భార్య‌, ఇద్దరు కూతుళ్ల‌కు కూడా వైర‌స్ సోకిన‌ట్లు పేర్కొన్నాడు. ఇక తాజాగా మ‌రో హాలీవుడ్ స్టార్ రాబర్ట్ ప్యాటిన్సన్  క‌రోనా బారిన ప‌డ్డారు. ట్విలైట్ సిరీస్‌తో పాపుల‌ర్ అయిన రాబ‌ర్ట్ కొద్ది రోజులుగా ది బ్యాట్‌మెన్ అనే చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. రాబ‌ర్ట్‌కు క‌రోనా అని తెలిసిన వెంట‌నే షూటింగ్ నిలిపివేశారు.

రాబ‌ర్ట్ న‌టిస్తున్న బ్యాట్‌మెన్ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం యూకేలో జ‌రుగుతుంది. క‌రోనా వ‌ల‌న మార్చిలో ఆగిన ఈ చిత్ర షూటింగ్ గ‌త మూడు రోజులుగా రెగ్యుల‌ర్‌గా జ‌రుపుకుంటుంది. అయితే ఇంకా మూడు నెల‌ల షూటింగ్ మిగిలి ఉంది. రాబ‌ర్ట్‌కు క‌రోనా రావ‌డంతో షూటింగ్ నిలిపివేయడంతో పాటు చిత్ర బృందం మొత్తం క్వారంటైన్‌కు వెళ్ళారు. అత‌ను త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు


logo