బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ భామే.. ఓవరాక్షన్ ఫలితం..

బిగ్ బాస్ అంటేనే కొన్నిసార్లు ఓవరాక్షన్ తప్పదు. చిన్నవాటికి కూడా ఒక్కోసారి చాలా పెద్దగా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. మంచి నీటి కోసం యుద్ధాలు జరిగినట్లు.. బిగ్ బాస్ ఇంట్లో తుమ్మినా దగ్గినా కొట్లాటలు జరుగుతుంటాయి. కెమెరా కంట్లో పడటానికి ప్రతీ చిన్న విషయాన్ని అక్కడ బూతద్దంలో పెట్టి మరీ చూస్తుంటారు కంటెస్టెంట్స్. అయితే కొందరు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో అయినా చాలా సెటిల్డ్ గా కనిపిస్తుంటారు. కానీ కొందరుంటారు.. వాళ్లేం చేసినా కూడా కాస్త అతిగానే అనిపిస్తుంటుంది. ఈ సారి బిగ్ బాస్ హౌజ్ లో కూడా అలాంటి అతి కంటెస్టెంట్ ఒకరున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆమె పేరు అరియానా.. ప్రతీ చిన్న విషయానికి ఓవర్ ఎగ్జైట్ అవుతూ ఉంటుంది ఈ భామ.
అందుకే అప్పుడప్పుడూ హౌజ్ లో గొడవలు పడుతూ ఉంటుంది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కావాలి అంటూ రచ్చ చేస్తుంటుంది. కెప్టెన్సీ టాస్కులో కూడా కాస్త ఓవర్ చేసిందంటూ అప్పట్లో వార్తలొచ్చాయి. దాంతో పాటు మరో టాస్కులో భాగంగా మొహంపై ఐస్ వాటర్ కొట్టి నాగార్జునతో కూడా చివాట్లు తింది అరియానా. ఎప్పుడూ అవినాష్ చుట్టూనే తిరుగుతూ గేమ్ ఆడటం కూడా మరిచిపోయిందంటూ విమర్శలు కూడా ఈమెపై ఉన్నాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే ఈ వారం ఎలిమినేట్ అయ్యే వాళ్ల లిస్టులో అందరికంటే ముందుంది అరియానా. ప్రోమో ప్రకారం చూస్తుంటే అవినాష్, అరియానా, అఖిల్, అభిజీత్ నామినేట్ అయ్యారు. అయితే అభి కోసం తనను తాను సెల్ఫ్ నామినేట్ చేసుకుంది మోనాల్.
దాంతో అభి సేవ్ అయ్యాడు. మిగిలిన ముగ్గురితో జాయిన్ అయింది మోనాల్. ఈ వారం లెక్కల ప్రకారం చూసుకుంటే కచ్చితంగా అభి, హారిక ఓట్లు అన్నీ మోనాల్ కు పడటం ఖాయం అయిపోయింది. దాంతో ఆమె సేవ్ అవ్వడం కూడా లాంఛనమే. టాప్ 5లో అఖిల్ కచ్చితంగా ఉంటాడేమో అనిపిస్తుంది. ఆయనకు బయట సపోర్ట్ కూడా పర్లేదు. అందుకే ఈ వారం అఖిల్ నామినేట్ అయినా కూడా వచ్చే నష్టమైతే ఉండకపోవచ్చు. ఇక ఎలిమినేషన్ అవినాష్, అరియానా మధ్యే ఉంది. కానీ అవినాష్ కు జబర్దస్త్ క్రేజ్ కాస్త పని చేస్తుంది. దాంతో ఈయన కూడా సేవ్ అవుతాడేమో అనిపిస్తుంది. మిగిలింది అరియానా మాత్రమే. కాంపిటీషన్ మరింత టఫ్ కావడంతో ఈ వారం అరియానా పెట్టేబేలా సర్దుకోవాల్సి వస్తుందని తెలుస్తుంది. ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప 12వ వారం ఇంటి నుంచి బయటికి వచ్చేది మాత్రం కచ్చితంగా ఈ తాండూరు పిల్లే.
తాజావార్తలు
- గుంత కనిపిస్తే..అధికారులకు జీహెచ్ ఎంసీ కమిషనర్ సీరియస్ వార్నింగ్
- మొసలితో పరాచకాలు..అరెస్ట్ చేసిన పోలీసులు
- నగరవాసుల యాదిలోకి మరోసారి డబుల్ డెక్కర్ బస్సు
- నేడు లాజిస్టిక్ పార్క్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
- పెళ్లాం కదా అని కొడితే కటకటాలే...
- దేశంలో కొత్తగా 11,666 కరోనా కేసులు
- శ్రీలంకకు ఐదు లక్షల డోసుల వ్యాక్సిన్ గిఫ్ట్..
- వార్తలలోకి 'మనం 2'.. ఆసక్తిగా గమనిస్తున్న ఫ్యాన్స్
- విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు.. ఇద్దరు సజీవ దహనం
- ఫిబ్రవరి 1 నుంచి వైద్య కళాశాలలు పునఃప్రారంభం