ఆదివారం 24 జనవరి 2021
Cinema - Nov 26, 2020 , 00:06:32

ఆ వార్తలు నిజం కాదు

ఆ వార్తలు నిజం కాదు

తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ  బిజీగా ఉంది పంజాబీ సొగసరి రకుల్‌ప్రీత్‌సింగ్‌. విభిన్నమైన  పాత్రలతో ప్రేక్షకుల్ని  అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో ఆమె భవిష్యత్తు చిత్రాలకు సంబంధించి పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. వివాదాల కారణంగా కొన్ని సినిమాల నుంచి రకుల్‌ తప్పుకొన్నట్లు ప్రచారం జరుగుతోంది.  ఈ వార్తలను రకుల్‌ప్రీత్‌సింగ్‌ టీమ్‌ ఖండించింది.  అవన్నీ అవాస్తవాలని తెలిపింది. రకుల్‌ప్రీత్‌సింగ్‌ నటిస్తున్న తాజా సినిమాలకు సంబంధించి ఆమె టీమ్‌ ఓ ప్రకటనను విడుదలచేసింది.  ‘ప్రస్తుతం తెలుగులో ‘చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో  నితిన్‌ కథానాయకుడిగా నటిస్త్తున్న ‘చెక్‌'లో లాయర్‌గా శక్తివంతమైన పాత్రలో రకుల్‌ కనిపిస్తుంది. అలాగే క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో పల్లెటూరి యువతిగా నటనకు ఆస్కారమున్న పాత్రలో కనిపించబోతున్నది.  తమిళంలో శివకార్తికేయన్‌ సరసన ఓ సినిమా చేస్తోంది. అలాగే బాలీవుడ్‌లో జాన్‌ అబ్రహమ్‌ ‘అటాక్‌'తో పాటు అర్జున్‌కపూర్‌ సినిమాల్లో రకుల్‌ భాగంకానుంది. అజయ్‌దేవ్‌గణ్‌, అమితాబ్‌బచ్చన్‌ ప్రధాన పాత్రల్లో నటించనున్న ‘మేడే’ చిత్రాన్ని ఇటీవలే అంగీకరించింది.  ఆసక్తికరమైన కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రాల్లో అత్యుత్తమ నటనను ప్రదర్శిస్తూ తన పాత్రలకు పరిపూర్ణంగాన్యాయం చేయాలనే తపనతో రకుల్‌ప్రీత్‌సింగ్‌ శ్రమిస్తోంది.  ఈ సినిమాలు మినహా కొత్త చిత్రాలేవీ ఆమె అంగీకరించలేదు’ అని రకుల్‌ టీమ్‌ వెల్లడించారు. logo