శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 29, 2020 , 20:13:40

బిగ్ బాస్ షోకు సుదీప్ అందుకే వచ్చాడా..?

బిగ్ బాస్ షోకు సుదీప్ అందుకే వచ్చాడా..?

ఎప్పుడూ నాగార్జున కనిపించే స్టేజీపై సడన్ గా సుదీప్ ప్రత్యక్షం అయ్యాడు. కన్నడ సూపర్ స్టార్ ను చూసి కంటెస్టెంట్స్ కూడా షాక్ అయ్యారు. అయితే ప్రతీ ఆదివారం ఏదో ఓ స్పెషాలిటీ ఉండేలా ప్లాన్ చేస్తుంటారు నిర్వాహకులు. ఈ సారి సుదీప్ ను తీసుకొచ్చారు. పైగా ఈయనకు బిగ్ బాస్ కూడా కొత్త కాదు. ఈ షోతో సుదీప్‌కు విడదీయరాని అనుబంధం ఉంది. కన్నడలో ఇప్పటికే 7 సీజన్స్ హోస్టు చేసాడు సుదీప్. అన్ని సీజన్స్ కూడా అక్కడ బ్లాక్ బస్టర్. తన హోస్టింగ్ తో అభిమానులకు పిచ్చెక్కిస్తున్నాడు కిచ్చా. ఇప్పుడు తెలుగులో కూడా బిగ్ బాస్ లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. సుదీప్ ను చూడగానే తెలుగు ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు. ఈయనకు షో మీద పూర్తిగా పట్టుంది. ఎవరితో ఎలా ఆడుకోవాలి.. ఎవర్ని ఎలా డీల్ చేయాలనేది సుదీప్ కు బాగా తెలుసు. దాంతో తెలుగులో కూడా రప్ఫాడించాడు ఈయన.


సుదీప్ కన్నడ సినిమా షూటింగ్ ఒకటి హైదరాబాద్ లోనే జరుగుతుంది. దాంతో ఒక్కసారి ఈయన్ని తీసుకొస్తే బాగుంటుందని ప్లాన్ చేసారు నిర్వాహకులు. అనుకున్నట్లుగానే ఈయన బిగ్ బాస్ షోకు వచ్చాడు. వచ్చీ రాగానే కంటెస్టెంట్స్ తో బాగానే కలిసిపోయాడు సుదీప్. ముఖ్యంగా వచ్చిన పని చాలా త్వరగా పూర్తి చేసాడు ఈయన. ఒక్కో ఇంటి సభ్యుడి గురించి తెలుసుకుని..చివరికి తాను ఎందుకు వచ్చాననేది చెప్పాడు సుదీప్. ఈయన వచ్చిన కారణం ఏంటంటే ఓ ఇంటి సభ్యుడికి ఫైనల్ టికెట్ ఇవ్వడం. ఇప్పటికే ఇంట్లో రేస్ 2 ఫినాలే మొదలైంది. అందుకే ఇప్పట్నంచి కెప్టెన్ కూడా ఉండరు. ఇప్పుడు సుదీప్ కూడా అందుకే వచ్చాడు. మరో మూడు వారాల ఆట మాత్రమే మిగిలి ఉండటంతో నేరుగా ఫైనల్ కు పంపించే ఆ కంటెస్టెంట్ ఎవరు అనేది అందరిలోనూ ఉండే ఆసక్తి. 


దానికి సమాధానంగా అభిజీత్ పేరు చెప్పాడు సుదీప్. ప్రస్తుతం ఇంట్లో అవినాష్, అరియానా, అఖిల్, హారిక, మోనాల్, అభిజీత్ ఉన్నారు. ఈ వారం ఎలిమినేషన్ లేదు. అఖిల్, మోనాల్ ఇప్పటికే సేవ్ అయ్యారు. అవినాష్, అరియానాలో అవినాష్ ఎలిమినేట్ అయితే తన దగ్గర ఉన్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడి సేవ్ అయ్యాడు. ఇదిలా ఉంటే సుదీప్ మాత్రం అభిజీత్ కు ఫైనల్ కార్డ్ ఇచ్చాడు. ఇంట్లో 10 కంటే ఎక్కువసార్లు నామినేట్ అయి సేవ్ అయ్యాడంటే అభి ఎంత స్ట్రాంగ్ అర్థమవుతుందని.. మొదట్నుంచీ బ్యాలెన్సింగ్‌గా గేమ్ ఆడుతున్నాడని చెప్పుకొచ్చాడు సుదీప్. అందుకే ఈయనకు ఫినాలే టికెట్ ఇచ్చినట్లు తెలిపాడు సుదీప్. మొత్తానికి ఒక్కరోజు ముందు అభిజీత్ పై నాగార్జున సీరియస్ అయితే.. తర్వాత రోజు సుదీప్ వచ్చి నేరుగా అతన్ని ఫైనల్ కు పంపించేసాడు. అదే మరి బిగ్ బాస్ గేమ్ అంటే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.