శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Cinema - Mar 26, 2020 , 17:47:10

దటీజ్ మెగాస్టార్.. సోషల్ మీడియాలో దూసుకుపోతున్న చిరు

దటీజ్ మెగాస్టార్.. సోషల్ మీడియాలో దూసుకుపోతున్న చిరు

మెగాస్టార్ చిరంజీవి మనస్థత్వం తెలిసిన ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఇది. ఇది మరోసారి నిరూపితమైంది. అదెలా అనుకుంటున్నారా? నూతన తెలుగు సంవత్సరం సందర్భంగా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన చిరంజీవి.. ఓ రేంజ్‌లో అందరినీ అలరిస్తున్నారు. ఓ వైపు కరోనా మహమ్మారితో ప్రజలు భయభ్రాంతులకు లోనవుతుంటే, భయపడాల్సింది ఏమీలేదు, అలాగని అశ్రద్ధ కూడా వద్దని టీవీలలో హెచ్చరిస్తున్న చిరంజీవి, సోషల్ మీడియాలోనూ అదే విధంగా కరోనాపై జాగ్రత్తలు చెబుతున్నారు. అయితే ఇక్కడ కూడా అందరినీ ఆయన ఎంటర్‌టైన్ చేస్తుండటం విశేషం. 

ట్విట్టర్‌లో తనకు స్వాగతం పలికి ప్రముఖ సెలబ్రిటీలందరికీ ఆయన ధన్యవాదాలు తెలుపుతూ.. వారికి కూడా ఏదో ఒకటి సజెషన్ ఇస్తున్నారు. వాస్తవానికి మెగాస్టార్ వంటి వ్యక్తి ఇతరులు, తనకంటే చిన్నవారు అయిన సెలబ్రిటీల ట్వీట్స్‌కి సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదు. కానీ మెగాస్టార్ మనసే వేరు. అందరినీ కలుపుకుని పోగల గొప్ప మనసు చిరుది. అందుకే అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ.. అందరి మన్ననలు పొందుతున్నారు. వరుస ట్వీట్స్‌తో యమా యాక్టివ్‌గా దూసుకెళుతున్న చిరు.. తాజాగా కరోనా మహమ్మారితో ఒక్కసారిగా ఉపాధి కోల్పోయిన సినీ వేతన కార్మికుల సంక్షేమం కోసం రూ. కోటి విరాళం ప్రకటించారు.


logo