బుధవారం 08 జూలై 2020
Cinema - Jan 31, 2020 , 13:04:03

తాప్సీ 'త‌ప్ప‌డ్' ట్రైల‌ర్ విడుద‌ల‌

తాప్సీ 'త‌ప్ప‌డ్' ట్రైల‌ర్ విడుద‌ల‌

'ఝుమ్మంది నాదం'తో చిత్రసీమలోకి ప్రవేశించిన తాప్సీ  తమిళ్‌, హిందీ చిత్రాల్లో నటిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది.  పింక్‌, బాద్లా వంటి సోష‌ల్ చిత్రాల‌తో పాటు  'సాండ్‌ కీ ఆంఖ్‌', 'రష్మి రాకెట్‌' వంటి మహిళా ప్రాధాన్య చిత్రాల్లో నటించింది. తాజాగా ముల్క్ దర్శకుడు అనుభవ్‌ సిన్హా కాంబినేషన్‌లో మరో మహిళా ప్రాధాన్య చిత్రంలో  నటిస్తుంది తాప్సీ. 

త‌ప్ప‌డ్ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో మ‌హిళా స‌మ‌స్య‌ల‌ని చూపించ‌నున్నారు.  మహిళలు చేస్తున్న కొన్ని చెబుతున్న కొన్ని చెప్పుకోలేని స‌మ‌స్య‌ల‌పై చిత్రం రూపొందుతోంది.  మహిళలు ఒక నిర్థిష్టమైన దానికే ఎందుకు కట్టుబడి ఉండాలన్న దానిపై ఈ చిత్రం ద్వారా ప్రశ్నించ‌నున్నారు. చిత్రంలో తాప్సీ సాధార‌ణ మ‌హిళ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. త‌న  పాత్ర ఈ సమస్యకు పరిష్కారం చూపుతుంది అని అంటుంది తాప్సీ. ఈ పాత్రలో చాలా కోపంగా, ఆగ్రహంగా ఊగిపోతూ ఉంటుంద‌ట. అమృత అనే పాత్రలో న‌టిస్తున్న తాప్సీ ప్రేక్ష‌కుల‌కి మంచి  వినోదాన్ని అందిస్తుంద‌ని అంటున్నారు. ఫిబ్ర‌వ‌రి 28న విడుద‌ల కానున్న ఈ  చిత్ర ట్రైల‌ర్ తాజాగా విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటుంది. ప‌వైల్ గులాటీ ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.logo