శుక్రవారం 07 ఆగస్టు 2020
Cinema - Jul 08, 2020 , 16:40:36

తాప్సీ నీకు అభిమానిని అయిపోయా: మంచులక్ష్మి

తాప్సీ నీకు అభిమానిని అయిపోయా: మంచులక్ష్మి

టాలీవుడ్ నటి మంచు లక్ష్మి, తాప్సీ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. మంచు లక్ష్మి నిర్మించిన ఝమ్మంది నాదం సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది తాప్సీ. ఆ తర్వాత కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన  ‘తప్పడ్’   సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాతో తాప్సీని పొగడ్తలతో ముంచెత్తింది లక్ష్మి మంచు.

మై డార్లింగ్ తాప్సీ. నేను నీకు అభిమాని కావటానికి ఒక్కటి కంటే ఎక్కువే కారణాలున్నాయి. ఇలాంటి అద్బుతమైన చిత్రంలో నటించిన నీకు, మిగిలిన నటీనటులు మరింత శక్తి వస్తుంది. 2 వారాల క్రితం తప్పడ్ సినిమా చూశాను. భారతీయ సమాజంలోని ఓ కమ్యూనిటీ నుంచి వచ్చిన మహిళగా..నేను చెప్పిన ప్రతీ అంశంపై అసలు ఏం చేయాలి..? ఏం చేయకూడదంటూ అనేక ప్రశ్నలు రేకెత్తించేలా ఈ చిత్రం ఉందని ట్వీట్ లో పేర్కొంది. 

దీనికి తాప్సీ రీట్వీట్ చేస్తూ..వావ్ నీ సాయంతో నేను ప్రయాణం మొదలు పెట్టిన పదేళ్ల తర్వాత నిన్ను గర్వించేలా చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ క్షణం అన్నింటి కంటే ప్రత్యేకమైనదని ప్రతీ ఒక్కరికీ తెలుసు. పెద్ద హగ్.. లవ్ ఎమోజీ ని పెట్టింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo