ఆదివారం 07 జూన్ 2020
Cinema - Mar 08, 2020 , 07:36:43

చైతూ చిత్రానికి 'థ్యాంక్యూ' టైటిల్ ప‌రిశీల‌న‌..!

చైతూ చిత్రానికి 'థ్యాంక్యూ'  టైటిల్ ప‌రిశీల‌న‌..!

అక్కినేని హీరో నాగ చైత‌న్య రీసెంట్‌గా వెంకీమామతో మంచి హిట్ కొట్టాడు. అంత‌క‌ముందు చేసిన మ‌జిలీ కూడా చైతూకి మంచి విజ‌యాన్ని అందించింద‌నే చెప్పాలి. ఇదే జోష్‌లో ప్ర‌స్తుతం శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ల‌వ్ స్టోరీ అనే చిత్రం చేస్తున్న చైతూ త‌ర్వాత సినిమాల‌ని కూడా లైన్‌లో పెట్టాడ‌ని అంటున్నారు. లేడి డైరెక్ట‌ర్ నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, మ‌నం వంటి ప‌వ‌ర్ ఫుల్ హిట్ చిత్రం తెర‌కెక్కించిన విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడ‌ట‌. విక్ర‌మ్ తెర‌కెక్కించే చిత్రాన్ని దిల్ రాజు నిర్మించ‌నుండ‌గా, ఈ చిత్రానికి థ్యాంక్యూ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టుగా తెలుస్తుంది. రొమాంటిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం ఉండ‌నుంద‌ని ఫిలిం న‌గ‌ర్ టాక్. మ‌రి కొద్ది రోజుల‌లో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది.  


logo